విష్ణు విషయంలో మనోజ్ పూర్తిగా ఓపెన్ అయిపోయినట్లేనా?
ఇటీవల కాస్త సద్దుమణిగినట్లు కనిపించిన మంచు ఫ్యామిలీలో మంటలు వ్యవహారం సంక్రాంతి పండుగ వేళ మళ్లీ మొదలైంది.
ఇటీవల కాస్త సద్దుమణిగినట్లు కనిపించిన మంచు ఫ్యామిలీలో మంటలు వ్యవహారం సంక్రాంతి పండుగ వేళ మళ్లీ మొదలైంది. ప్రధానంగా కనుమ రోజు మనోజ్ దంపతులు మోహన్ బాబు విద్యాసంస్థల ప్రాంగణంలోని గ్రాండ్ పేరెంట్స్ సమాధుల్ని దర్శించుకునేందుకు ప్రయత్నించడం.. సెక్యూరిటీ వారిని అడ్డుకోవడంతో వివాదం మళ్లీ మొదలైందనే చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తో పాటు మరికొంతమందిపై మోహన్ బాబు తరుపున చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు అందింది! ఇదే సమయంలో... తనను అడ్డుకోవడంపై మనోజ్ కూడా అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి! దీంతో... వ్యవహారం మళ్లీ మొదలైందనే చర్చ మొదలైందని అంటున్న వేళ.. మరో వివాదం తెరపైకి వచ్చింది.
అవును... జల్ పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని.. వాటిని తనకు ఇప్పించాలని.. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తాను కోరుతున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో... మనోజ్ కు కలెక్టర్ నుంచి నోటీసులు రావడం.. మనోజ్ శనివారం కలెక్టర్ ను కలవడం జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో... మనోజ్ ను జల్ పల్లి ఇంటి నుంచి బయటకు పంపించడమే ఈ ఫిర్యాదు వెనుక ఉన్న ఉద్దేశ్యం అని స్పష్టమవుతుందని అంటున్నారు. ఈ సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వచ్చిన మనోజ్ వివరాలు అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్.. పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా... తన తండ్రిని తాను ఏనాడూ వ్యతిరేకించను అని మొదలుపెట్టిన మనోజ్.. నాన్నను ముందుకు తోసి వెనుక నుంచి తన అన్న ఆడుతున్న నాటకం ఇది అని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా... జల్ పల్లి నివాసం ఖాళీ చేయమని కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై లిఖితపూర్వకంగా స్పందిస్తానని తెలిపాడు.
దీంతో.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా మనోజ్ పెడుతున్న పోస్టులు, విడుదల చేస్తున్న వీడియోలు పేరు చెప్పకుండా నర్మగర్భంగా విష్ణు గురించే అనే చర్చ నడుస్తుందని చెబుతున్న వేళ... తాజా పరిణామాలతో విష్ణు విషయంలో మనోజ్ ఓపెన్ అయిపోయినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.