బాలీవుడ్ ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. తనను బాలీవుడ్ హీరోయిన్ అంటే ఒప్పుకోకుండా ఇండియన్ యాక్ట్రెస్ అని చెప్పమంటున్న ప్రియాంకకు.. పెళ్లి కబుర్లపై అమ్మ మధు చోప్రా స్పందించింది. గతంలో చాలాసార్లు ప్రియాంకతో పెళ్లి విషయమై మాట్లాడిందట ఈమె. అయితే.. ఇప్పుడు మాత్రం తన కూతురు పెళ్లికి ఇంకా టైం ఉందని భావిస్తున్నట్లు చెబుతోంది మధు చోప్రా.
'ఇప్పుడు చాలా పెళ్లిళ్లు విచ్ఛిన్నం అవుతున్నాయి. ప్రజలకు వారి భాగస్వామితో సర్దుకుపోయే సహనం ఉండడం లేదు. అనుబంధాన్ని కొనసాగించాలని అనుకోవడం లేదు. ప్రియాంక చోప్రా ఆ స్థాయిని చేరుకున్నాక.. తన పెళ్లి విషయమై తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటాను. ఓ వయసు రాగానే పెళ్లి చేయాలి అనే ఆలోచన సరైనది కాదు. దానికి తగిన మెచ్యూరిటీ ఉండాలి' అని చెప్పింది ప్రియాంక అమ్మ.
తనకు రాబోయే అల్లుడు సినీ పరిశ్రమకు చెందినవాడు కానవసరం లేదన్న పీసీ మదర్.. ఇంకా చెప్పాలంటే.. ఇండస్ట్రీ బయటి వ్యక్తికే ప్రాధాన్యం ఇస్తానని తేల్చేంది. అప్పుడు తన ఆలోచనా పరిధి పెరుగుతుందని, బయటి ప్రపంచం గురించి తెలుసుకునే నేర్చుకునే అవకాశం కూతురుకు వస్తుందని అంటోంది మధు చోప్రా.