తెలంగాణ ఉద్యమంలో తన గొంతుతో ఉద్యమస్ఫూర్తిని పెంచటంలో కళకారుల పాత్ర ఎంతో తెలిసిందే. ఎంతోమంది కళాకారులు ఉన్నా.. వర్దమాన గాయని మధుప్రియ కాస్త భిన్నం. తన పాటతో ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ.. ఆంధ్రాలకు చెందిన వారికి ఆమె సుపరిచితురాలు. అయితే.. మధుప్రియ ప్రేమ వ్యవహారం అనూహ్య మలుపులకు దారి తీసిందని చెబుతున్నారు. గురువారం అర్థరాత్రి ఆమె ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది.
తన ప్రియుడితో కలిసి మధుప్రియ కాగజ్ నగర్ కు గురువారం అర్థరాత్రి చేరుకుంది. శుక్రవారం వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి.. మధుప్రియ ఇంట్లోని వారికి చెబితే వారు అందుకు అంగీకరించలేదు. దీంతో.. ఆమె ప్రేమ వ్యవహారం పలు మలుపులు తిరిగినట్లుగా చెబుతున్నారు.
ప్రియుడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించటం.. అదికాస్త బెడిసికొట్టి కిడ్నాప్ యత్నం వరకూ వెళ్లినట్లు చెబుతున్నారు. ఆమె పెళ్లికి సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ప్రియుడితో సహా మధుప్రియ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు. మరి.. ఆమె ప్రేమ వ్యవహారానికి ఎలాంటి ముగింపు పడుతుందో..?