రోజా.. దక్షిణాది సినిమాకు ఎంతో గౌరవం తీసుకొచ్చిన చిత్రం. మణిరత్నంను గొప్ప దర్శకుడిగా బాలీవుడ్ కూడా గుర్తించిన చిత్రం. రెహమాన్ అనే ఆణిముత్యాన్ని సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. ఈ రోజు రెండు ఆస్కార్ అవార్డులు కూడా అందుకునే స్థాయికి రెహమాన్ ఎదిగాడంటే.. అది ‘రోజా’ చలవే. ఐతే రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికవడం అనూహ్యమనే చెప్పాలి.
రోజా ముందు వరకు మణిరత్నం తన ప్రతి సినిమాకూ ఇళయరాజాతోనే పని చేశారు. ఐతే రోజా నిర్మాత బాలచందర్ కు ఇళయరాజాతో గొడవ వల్ల ఆయన వద్దంటే వద్దని పట్టుబట్టారు. మణికి కూడా రాజాతో కొన్ని ఇగో క్లాషెస్ ఉండటంతో వేరే సంగీత దర్శకుడిని ఎంచుకుందామనుకున్నారు. ముందుగా మహేష్ మహదేవన్ (ప్రేమించుకుందాం రా సంగీత దర్శకుడు) కోసం ప్రయత్నించారు. ఐతే ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతను కుదరదన్నాడు.
ఆ సమయంలో రెహమాన్ మీద పడింది మణిరత్నం కళ్లు. ఓసారి ట్రై చేద్దామని అతడితో మ్యూజిక్ సిట్టింగ్స్ పెడితే.. అద్భుతమైన ట్యూన్లు ఇచ్చి మెప్పించాడు. ఆ తర్వాత అవే ట్యూన్లు దేశవ్యాప్తంగా సంగీత సునామీ తీసుకొచ్చాయి. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు కొల్లగొట్టిన రెహమాన్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రోజా సినిమాకు సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు ముందు ఐశ్వర్యారాయ్ ని హీరోయిన్ అనుకున్నారట మణి. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె సినిమా చేయలేని పరిస్థితుల్లో ఉండటంతో మధుబాలకు అవకాశం దక్కింది. ‘రోజా’గా ఆమె ఎంత పేరు తెచ్చుకుందో వేరే చెప్పాలా!