త‌మ‌న్నా...ర‌కుల్ పై పంచ్ వేసేసిన మ‌ధుబాల‌!

Update: 2022-11-23 17:30 GMT
అందాల మ‌ధుబాల సినీ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఆమె సినిమాలు చేసారు.  'రోజా'..'అల్ల‌రి ప్రియుడు'..'జెంటిల్మెన్' లాటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా దగ్గ‌రైన న‌టి ఆమె. కొన్నాళ్ల పాటు త‌న అందం..అభిన‌యంతో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన న‌టి. 40 ఏళ్లు దాటినా మ‌ధుబాల ఇంకా  అదే అందంతో ప్రేక్షకుల్ని అల‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం అమ్మ‌..అత్త పాత్ర‌ల‌తోనూ మ‌ధుబాల మెప్పిస్తున్నారు. అయితే సౌత్ లో కంటే ఎక్కువ‌గా హిందీలో సినిమాలు చేసారు. అలాగ‌ని అక్క‌డా  పెద్ద‌గా పాపుల‌ర్ కాలేదు. ఇక సౌత్ లో సైతం భారీ సినిమాలు చేసింది లేదు. ఆ ర‌కంగా మ‌ధుబాల ఐడెంటీటీ ఏ భాష‌లోనూ ప‌రిపూర్ణంగా లేదు. ఇవే విష‌యాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్ల‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

'ప‌రిశ్ర‌మ‌లో  పోటీ ఉప్పుడూ ఉంటుంది. కానీ నేను ఆ పోటీని ఎప్పుడూ తీసుకోలేదు. మ‌నకి ఏ పాత్ర రాసిపెట్టి ఉంటే ఆ పాత్ర వ‌స్తుంద‌ని చేసుకుంటూ వెళ్లిపోయా.  ఇప్పుడు అలాగే ప్ర‌యాణాన్నికొన‌సాగిస్తున్నా. ఒక భాష‌నే ల‌క్ష్యంగా పెట్టుకుని ఎప్పుడూ ప‌నిచేయ‌ల‌దు.  కేవ‌లం ప్ర‌తిభ‌ను  అన్ని భాష‌ల్లో చాటాలున‌కున్నాను త‌ప్ప ఎక్క‌డా ఫోక‌స్డ్ గా ప‌నిచేయ‌లేదు.

అందుకే ఏ భాష‌లోనూ నాకు ఎక్కువ‌ సినిమాలు లేవు.  రోజా..జెంటిల్మెన్ సినిమాలు అన్ని భాష‌ల్లో మంచి పేరును  తీసుకొచ్చాయి. ఇప్పుడు ర‌కుల్ ..త‌మ‌న్నా లాంటి వారు తెలుగు నేర్చుకుని  ఇక్క‌డ వ‌రుస‌గా సినిమాలు చేసినా వాళ్ల‌ని  ముంబై భామ‌ల‌నే అంటారు.  కానీ ఆ రోజు న‌న్నెవ‌రు ముంబై అమ‌మాయిలా చూడ‌లేదు.

ఏ భాష‌లో సినిమా చేస్తే ఆ భాష హీరోయిన్ గానే ఆద‌రించారు. అందుకు నేను చాలా అందృష్ట‌వంతురాలిన‌నే చెప్పాలి. కానీ మిగ‌తా భాష‌ల‌న్నింకంటే తెలుగు అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఇక్క‌డున్నంత కంప‌ర్ట్ వేరే భాష‌ల్లో క‌ల‌గ‌లేదు.  ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు ఆద‌ర‌ణ‌కు నోచుకుంటున్నాయి.   ఇంత‌కు ముందు త‌క్కువ బ‌డ్జెట్ సినిమాలంటే..అలాగే క‌నిపించేవి. కానీ ఇప్పుడు చిన్న సినిమా అంటున్నారే గానీ నిర్మాణ విలువ‌లు చూస్తుంటే అలా అనిపించలేదు.  ఇక‌పై తెలుగు సినిమాలు టార్గెట్ గా పనిచేయాల‌నుకుంటున్నా' అని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News