మధుర శ్రీధర్ రెడ్డి టాలీవుడ్ కు పరిచమైంది ఆడియో కంపెనీ యజమానిగా. ఐతే తర్వాత అనూహ్యంగా డైరెక్షన్ వైపు అడుగులేశాడతను. ఆపై నిర్మాతగా మారి.. కొత్త వాళ్లతో సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. తాజాగా ఆయన సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. నిర్మాతగా శ్రీధర్ జోరేమీ తగ్గించట్లేదు. ఆయన ఒకటికి మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. అందులో ‘ఒకమనసు’తో తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన రామరాజుతో చేయబోయే సినిమా కూడా ఒకటి కావడం విశేషం. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి శ్రీధర్ ఏమన్నాడంటే..
‘‘మొదట్నుంచి నా సినిమాలతో కొత్త ప్రతిభను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. సుజయ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘ఎ ఫర్ అమెరికా’ పేరుతో త్వరలోనే ఓ చిత్రాన్ని ప్రారంభిస్తా. అందులో నటీనటులంతా కొత్తవాళ్లే. అమెరికాకి వెళ్లాలనుకున్న వాళ్లు.. అక్కడినుంచి వచ్చిన వాళ్ల మధ్య జరిగే మానసిక సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అలాగే సంజీవ్ అనే మరో డెబ్యూ డైరెక్టర్ తో ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే చిత్రాన్ని నిర్మిస్తా. అలాగే రామరాజు దర్శకత్వంలో ‘ప్రియురాలు’ పేరుతో సినిమా నిర్మించనున్నాను. ఇదో సరికొత్త ప్రేమకథ. దర్శకుడిగా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ చిత్రం నిరాశ పరిచింది. అప్పట్నుంచి నిర్మాణంపైనే దృష్టిపెట్టా. దర్శకుడిగా ఓ కొత్త కథతో ఓ చిత్రాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నా. అలాగే తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నా. 1967 నుంచి 2014 జూన్ 2 వరకు జరిగిన సంఘటనల ఆధారంగా ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తా. కేసీఆర్ పోలికలున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావుతో కేసీఆర్ పాత్ర చేయించాలనే ఆలోచన ఉంది. ఈ చిత్రాన్ని హిందీ.. తమిళ భాషల్లోనూ తీయాలనుకుంటున్నా’’ అని శ్రీధర్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/