అబ్బబ్బా మాధురి.. ఏంటీ తాకిడి!!

Update: 2016-07-16 15:30 GMT
ఓ తరం క్రితం ఇండియా యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్. ఇప్పుడామె ఏజ్ ఎంతో తెలుసా? 49 సంవత్సరాలు. ఇప్పుడు మాధురి వయసు సంగతి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే.. ఓ డ్యాన్స్ షో లో లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చి.. తన ఏజ్ కి తనలో గ్రేస్ కి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పకనే చెప్పింది మాధురి.

"సో యు థింక్ యు కెన్ డ్యాన్స్; అబ్ ఇండియాకీ బారీ" ఇదో డ్యాన్స్ షో. & టీవీ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఓ డ్యాన్స్ మహా సంగ్రామం టైపులో ఉంటుంది. పార్టిసిపెంట్ల ట్యాలెంట్ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడీ ప్రోగ్రామ్ కి ఫైనల్ ఎపిసోడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్జ్ లలో మాధురీ దీక్షిత్ కూడా ఉంది. కెరీర్ లో ఉన్నంత కాలం డ్యాన్సింగ్ క్వీన్ అనిపించుకున్న మాధురి.. ఈ డ్యాన్స్ రియాలిటీ షో ఆఖరి ఎపిసోడ్ లో డ్యాన్స్ తో అదరగొట్టేసింది. డార్క్ బ్లూ కలర్ చోళీ.. బ్లూ కలర్ బాటమ్ తో.. మిలమిలా మెరిసిపోయింది మాధురీ దీక్షిత్.

నలభై తొమ్మిదేళ్ల వయసులో కూడా నాభి అందాలను ప్రదర్శిస్తూ.. ఈ బ్యూటీ చేసిన డ్యాన్స్ కి ఎవరైనా ఫిదా అవాల్సిందే. తన ట్యాలెంట్ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే చూస్కోండి కాస్కోండి అన్న రేంజ్ లో మాధురి డ్యాన్స్ పెర్ఫామెన్స్ సాగింది. అంతా చూశాక.. మాధురిలో వయసు తెచ్చిన మార్పేమీ లేదని ఆ తరం అభిమానులు అనుకుంటున్నారు.
Tags:    

Similar News