ఆ హింసేంటి? ఆ పన్నేంటి? నిలదీసిన కోర్టు

Update: 2016-12-12 07:48 GMT
ఇక నుంచి తమిళ సినిమావాళ్లకు.. తమ సినిమాలకు పన్ను మినహాయింపులు పొందడం అంత సులభం కాకపోవచ్చు. తాజాగా మద్రాస్ హైకోర్టు నుంచి తమిళనాడు ప్రభుత్వానికి ఎదురైన సవాళ్లే ఇందుకు కారణంగా చెప్పచ్చు.

తమిళ భాషకు ప్రచారం కల్పించడం కోసం అంటూ తమిళ్ లో టైటిల్ ఉండి.. యూ సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు ఎంటర్టెయిన్మెంట్ ట్యాక్స్ నుంచి రాయితీ లభిస్తూ ఉంటుంది 2006 నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ సజావుగానే నడిచినా ఇప్పుడు హైకోర్టు నుంచి ఎదురైన ప్రశ్నలు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగా ఉంటున్నాయి. 'నిజంగానే తమిళ భాష ప్రమాణాలను పెంచేవిగా ఉన్న చిత్రాలకే పన్ను రాయితీ ఇస్తున్నారా' అన్నది వీటిలో ప్రధానమైన ప్రశ్న కాగా.. మరికొన్ని కూడా ఇబ్బంది పెట్టేవే.

'పన్ను రాయితీ పొందిన సినిమాలకు.. టికెట్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'.. 'సినిమాలో వయలెన్స్ ఎక్కువగా ఉన్నా ఆ సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వడం లేదు?' అంటూ హైకోర్టు ప్రశ్నించడంతో.. ఇకపై చెన్నైలో సర్టిఫై అయ్యే సినిమాలపై సెన్సార్ బోర్డ్ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటిమాదిరిగా మెజారిటీ సినిమాలు పన్ను రాయితీ ఎంజాయ్ చేయలేకపోవచ్చు.
Tags:    

Similar News