వివాదంలో కోర్టు గడప తొక్కిన హీరో

Update: 2015-07-30 07:43 GMT
సినిమా కథాంశాలు, సన్నివేశాల విషయంలో ఎప్పటికప్పుడు వివాదాలు బైటికొస్తూనే ఉన్నాయి. భారతదేశంలోనే నంబర్‌ 1 సినిమాగా పేరు తెచ్చుకున్న బాహుబలికే ఆ తిప్పలు తప్పలేదు. ఈ సినిమాలో 'అవంతిక రేప్‌'కి గురైందంటూ ఓ మహిళా జర్నలిస్టు వివాదాన్ని తెరపైకి తెచ్చారు. దానికి సమాజిక వెబ్‌ సైట్ల లో మద్ధతు లభించింది. అంతకంటే ముందే కమల్‌ హాసన్‌ నటించిన విశ్వరూపం సిరీస్‌ విశ్వహిందూ పరిషత్‌ ఆగ్రహానికి గురైంది.

అలాగే 'చీకటి రాజ్యం'లో దళితులకు సంబంధించిన వివాదాస్పద అంశాలున్నాయంటూ వివాదాలు చెలరేగాయి. ఇన్ని వివాదాల నడుమ తాజాగా ధనుష్‌ సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. 'కాక్క ముట్టాయ్‌' అనే సినిమాలో ఓ మహిళ లాయర్‌ విషయంలో మాట్లాడే సంభాషణలు వివాదాస్పదంగా ఉన్నాయని మణివణ్ణన్‌ అనే లాయర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ధనుష్‌, ఐశ్వర్య రాజేష్‌ ఇద్దరూ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అది క్యారెక్టరైజేషన్‌ ప్రకారం సందర్భోచితంగా వచ్చిన సన్నివేశం. వివాదాల్లోకి లాగొద్దంటూ ధనుష్‌ మొరపెట్టుకున్నాడు. విజువల్స్‌ పరిశీలించిన హైకోర్టు అందులో మరీ అంత హానికరమైన సంభాషణలేవీ లేవని ఈ కేసులో స్టే విధించింది.

Tags:    

Similar News