సర్కార్ పై మద్రాస్ హైకోర్టులో కేసు!

Update: 2018-10-27 08:40 GMT
మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ 'సర్కార్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.   గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'తుపాకి'.. 'కత్తి' సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ సినిమా నవంబర్ 6 న విడుదలకు సిద్దం అవుతోంది.  అంతా సాఫీగా ఉందనుకునేలోపు 'సర్కార్' పై కాపీ ఆరోపణలు వచ్చాయి.

వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత సౌత్ ఇండియన్ ఫిలిం రైటర్స్ అసోసియేషన్లో 'సెంగోల్' అనే టైటిల్ తో ఒక కథను 2007 లో రిజిస్టర్ చేయించుకున్నాడట. ఇప్పుడు మురుగదాస్ - విజయ్ ల 'సర్కార్' కథ తన సెంగోల్ ను పోలి ఉందని.. తనకు న్యాయం జరిగేవరకూ సినిమా విడుదల ఆపాలని మద్రాస్ హైకోర్టులో ఫిర్యాదు చేశాడు.  తనకు పరిహారంగా రూ. 30 లక్షల డబ్బు.. సినిమా టైటిల్స్ లో కథ క్రెడిట్ ఇవ్వాలని 'సర్కార్' టీమ్ ని డిమాండ్ చేస్తున్నాడు.

వరుణ్ వాదనలు విన్న జడ్జ్ రెండు కథలను పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతామని వచ్చే గురువారానికి కేసు హియరింగ్ ను వాయిదా వేశాడు.  దీంతో 'సర్కార్' నిర్మాతలయిన సన్ పిక్చర్స్ వారు.. దర్శకుడు మురుగదాస్ లు కేవియట్ పిటీషన్లు దాఖలు చేశారట.  ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News