మ్యాస్ట్రో ఇళయరాజాకి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఆయన ఏం చేసినా ఆ సవ్వడి అభిమానుల గుండె ల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. నిరంతరం సంగీత సాధన తో ఒక యోగిని తలపించే రాజా ఇప్పటికే 5000 పైగా స్వరాల్ని సమకూర్చి చరిత్ర సృష్టించారు. తెలుగు, తమిళ్, హిందీలో ఆయన వందల సినిమాలకు పనిచేశారు. 72 వయసులోనూ ఇప్పటికీ సినిమాలకు సంగీతం అందిస్తూ, సంగీత విభావరులు నిర్వహిస్తూ .. ఎంతో బిజీగా ఉన్నారాయన. రాజా నిత్య యవ్వనుడు అంటే తప్పేం కాదు.
అయితే అంతటి రాజా ఉన్నట్టుండి కుప్పకూలారు. కడుపులో నొప్పి అంటూ మెలికలు తిరిగిపోయారు. ఈ వార్త దేశ, విదేశాల్లో అభిమానుల్ని ఎంతో కలవరపెట్టింది. అసలు రాజాకి ఏమైంది? ఇప్పుడెలా ఉన్నారు? అన్న ఆత్రుత అభిమానుల్లో పెరిగిపోయింది. అయితే దీనికి ఇళయరాజా కజిన్ దర్శకుడు వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఇళయరాజా సేఫ్ గానే ఉన్నారు. ఆస్పత్రినుంచి సోమవారం డిశ్చార్జ్ చేస్తారు. ఆగస్టు 15 రోజున ఆయనకి స్వల్ప అస్వస్థత కలిగింది. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కడుపునొప్పి తో ఇబ్బంది పడ్డారంతే. ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు'' అంటూ క్లారిటీ నిచ్చారు. ఇళయరాజా ఇటీవలే గురువు ఎం.ఎస్.విశ్వనాథన్ పై అభిమానంతో చెన్నయ్ లో సంగీత విభావరి నిర్వహించిన సంగతి తెలిసిందే.