నితిన్ 'మాస్ట్రో' వారమే బ్యాలన్స్‌

Update: 2021-05-31 06:31 GMT
యంగ్‌ హీరో నితిన్ బాలీవుడ్‌ హిట్‌ మూవీ అంధాదున్ రీమేక్‌ షూటింగ్‌ కరోనా కారణంగా నిలిచి పోయింది. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ఎంత బ్యాలన్స్ ఉందనే విషయమై దర్శకుడు మేర్లపాక గాంధీ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలు అన్నింటిని కూడా గోవాలో చిత్రీకరించారట. సినిమాను జూన్‌ లో విడుదల చేయాలని భావించారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ తో సినిమా చిత్రీకరణ కూడా ముగించలేక పోయారు. దాంతో అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా మెల్లగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తున్నారు.

చిత్రం షూటింగ్‌ విషయమై దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ఇప్పటికే షూటింగ్‌ మెజార్టీ పార్ట్‌ పూర్తి అయ్యింది. కేవలం వారం రోజుల వర్కింగ్‌ డేస్ తో సినిమా పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ తో సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారట. ఇక సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా మెల్లగా సాగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్‌ ను మొదలు పెట్టి వెంటనే ముగిస్తామని ఆయన అన్నాడు.

బాలీవుడ్‌ లో హిట్ అయిన అంధాదున్ లో టబు కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఆ పాత్రను ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా పోషిస్తోంది. నితిన్ మరియు తమన్నాల కాంబో సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక ఒరిజినల్‌ వర్షన్‌ కు చాలా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందట. నితిన్ హోం బ్యానర్‌ లో రూపొందిన ఈ సినిమా ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
Tags:    

Similar News