ఇటీవల టాలీవుడ్ పరిశ్రమలో కూడా రీమేక్స్ హవా బాగానే జోరుగా కొనసాగుతుంది. ఆల్రెడీ తమిళ - మలయాళం - కన్నడ ఇండస్ట్రీల నుండి పలు సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. ఇక అదేకోవలో హీరో నితిన్ మాస్ట్రో సినిమా కూడా తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ అవార్డు విన్నింగ్ మూవీ 'అంధాధున్' సినిమాను నితిన్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్సప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నభానటేష్ నటిస్తోంది.
ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ మధ్య మాంచి కెమిస్ట్రీ కుదిరిందని టాక్. అలాగే ఈ సినిమాలో కీలకమైన బోల్డ్ క్యారెక్టర్ లో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సినీ వర్గాలలో మాస్ట్రో రిలీజ్ సంబంధించి న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. మాస్ట్రో సినిమాను ఓటిటి రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇదివరకు ప్రేక్షకులు తెలుసుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటిటి డీల్ కూడా సెట్ అయిపోయినట్లు తెలుస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారితో మేకర్స్ చర్చలు జరిపి మొత్తానికి సినిమా డిజిటల్ రైట్స్ 32 కోట్లకు బేరం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు హీరోనే కాకుండా ప్రొడ్యూసర్ కూడా నితిన్ కావడంతో సినిమాకు అదనంగా ప్లస్ అయింది. ఇంకా ఆడియో రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉన్నాయని టాక్. ఇప్పటివరకు సినిమాకు దాదాపుగా 29కోట్లు ఖర్చు అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన సినిమా 32కోట్లకు అమ్ముడైంది అంటే ప్రొడ్యూసర్ లాభాలు గడించినట్లే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి చివరి దశ పనులు పూర్తి అవుతున్నాయి. జులైలో ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఆగష్టు 2వ వారంలో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి ఇంతవరకు రిలీజ్ చేసిన పోస్టర్స్.. వీడియోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చూడాలి మరి త్వరలోనే డేట్ ప్రకటిస్తారేమో!