అరబ్ కంట్రీలో ఆరంభవుతున్న భారతం

Update: 2017-06-01 04:58 GMT
భారతీయుల సాంస్కృతిక సంపద మహాభారతం. ఈ మహాకావ్యాన్ని సినిమాగా రూపొందించేందుకు సన్నాహాలు మొదలైపోతున్నాయి. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ.. దీన్ని మీడియా అంత సీరియస్ గా తీసుకోలేదు. ప్రాజెక్ట్ ను అఫీషియల్ లాంఛ్ చేశాక చూద్దాంలే అన్న ధోరణి కనిపించింది.

అయితే.. ఇప్పుడీ మహాభారతం షూటింగ్ కు కూడా షెడ్యూల్స్ వేసేసుకుంటున్నారట. మొదటగా అబుదాబిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. మహాభారతానికి అబుదాబికి లింక్ ఏంటనే ప్రశ్న రావడం సహజమే కానీ.. కథ ప్రకారం అత్యధికంగా బడ్జెట్ కేటాయించాల్సినది యుద్ధ సన్నివేశాలకే. మిగిలినదంతా ఎలాగూ సెట్స్ వేయక తప్పదు. అందుకే మొదటగా వార్ సీన్స్ నే పిక్చరైజ్ చేస్తారట. కురుక్షేత్ర సంగ్రామాన్ని కూడా ఎడారి ప్రాంతంలోనే పిక్చరైజ్ చేసి.. వాటికి గ్రాఫిక్స్ జోడించేందుకు వీలైనంత సమయం కేటాయిస్తారట.

అందుకే అబుదాబిలో షూటింగ్ మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మలయాళం.. తమిళ్.. తెలుగు.. హిందీతో పాటు.. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ మహాభారతం ప్రాజెక్టును 2 భాగాలుగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News