మహానటి చేటు చేసిందా?

Update: 2018-06-20 10:12 GMT
‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఎంచుకున్నపుడు ఆమెపై అందరికీ ఎన్నో సందేహాలు కలిగాయి. కానీ ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తూ సావిత్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. గొప్ప ప్రశంసలు అందుకుంది. ఐతే ఈ సినిమా తర్వాత కీర్తి కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుందని.. ఆమెకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వచ్చేస్తాయని అనుకున్నారు. కానీ ఆల్రెడీ కమిటైన సినిమాలు తప్పితే కొత్తగా ఆమెకు ఛాన్సులేమీ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో దర్శక నిర్మాతల తప్పేమీ లేదని.. కీర్తినే ఈ విషయంలో కొంచెం మడికట్టుకు కూర్చుందని అంటున్నారు ఆమె సన్నిహితులు. ‘మహానటి’ ఒక రకంగా ఆమెకు చేటు చేసిందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

‘మహానటి’ తర్వాత కీర్తి మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. వాటిని అందుకునే పాత్రలే చేయాలని కీర్తి ఫిక్సయిందట. ఆషామాషీ క్యారెక్టర్లు.. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ ఆమె ప్రిఫర్ చేయట్లేదట. ఈ కోవలో వచ్చిన కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఆమె వదులుకున్నట్లు సమాచారం. ఐతే కీర్తి నిర్ణయం కరెక్టేనా అన్న చర్చ నడుస్తోంది. ‘మహానటి’ లాంటి పాత్రలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. ప్రతిసారీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే కావాలంటే కష్టం. కాబట్టి గ్లామర్ రోల్స్ కూడా చేస్తూనే.. అవకాశం వచ్చినపుడు ప్రత్యేకమైన పాత్రల్లోనూ మెప్పించాలి. అనుష్క.. సమంత లాంటి వాళ్లు ఇలాగే తమ కెరీర్లను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లారు. ఇలాంటి పాత్రలే కావాలని వాళ్లు పట్టుబట్టి కూర్చోలేదు. గ్లామర్ రోల్స్ చేస్తూనే స్పెషల్ క్యారెక్టర్లు వచ్చినపుడు వాటిని అద్భుతంగా పండించారు. కాబట్టి కీర్తి కూడా వారి బాటలోనే నడవాలి. లేదంటే కెరీర్ దెబ్బ తినేస్తుంది.
Tags:    

Similar News