ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ దాదాపుగా అయిపోయినట్లే. ఇంకా ఏపీలో ఓ 10 రోజుల పాటు సెలవలు ఉన్నాయ్ కానీ.. తెలంగాణలో అయితే మాత్రం స్కూల్స్ బిగిన్ అయిపోయాయి. మరి సమ్మర్ సినిమాల వరకు చూసుకుంటే.. ఈ సారి ప్రతీ నెలా ఒక బ్లాక్ బస్టర్ దక్కింది.
మార్చ్ చివర్లో రిలీజ్ అయిన రామ్ చరణ్ రంగస్థలం.. ఏప్రిల్ అంతా ఎఫెక్ట్ చూపించి నాన్ బాహుబలి రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఏప్రిల్ 3వ వారంలో వచ్చిన మహేష్ మూవీ భరత్ అనే నేను.. 105 కోట్లకు పైగా వసూళ్లను సాధించగలిగింది. ఇక మే నెల మాత్రం పూర్తిగా మహానటికి రాసిచ్చేసినట్లుగా అయిపోయింది. ప్రారంభంలో వచ్చిన అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోగా.. ఆ తర్వాత వారంలో వచ్చిన మహానటి యావరేజ్ గానే మొదలైంది. కానీ అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా రెండో రోజుకే పుంజుకున్న ఈ మూవీ.. అద్భుతమైన వసూళ్లను కొనసాగించింది.
ఆ తర్వాత వచ్చిన పూరీ జగన్నాధ్ మూవీ మెహబూబా.. విజయ్ ఆంటోనీ డబ్బింగ్ సినిమా కాశి.. రవితేజ నేల టికెట్.. నాగశౌర్య అమ్మగారిల్లు చిత్రాలు దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయి. దీంతో జనాలుక మహానటి ఒక్కటే ఆప్షన్ గా నిలిచింది. దీంతో సమ్మర్ సీజన్ లో అత్యంత కీలకమైన మే నెలను క్యాష్ చేసుకునే అవకాశం కీర్తి సురేష్ మహానటికే దక్కింది.