ఓ సినిమా జయాపజయాల గురించి డీటైలింగ్ ఇవ్వడంలో.. ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్కడ వసూళ్ల వరద పారిస్తున్న కొన్ని చిత్రాలు.. మూవీ బడ్జెట్ లో మేజర్ పోర్షన్ ను రాబట్టేయగలుగుతున్నాయి. నాలుగోవారంలోకి అడుగు పెట్టిన మహానటి చిత్రం.. ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తొలి వారాంతంలో చూపించిన జోరుతో పోల్చితే.. వసూళ్లు నెమ్మదించినా.. కలెక్షన్స్ నిలకడగానే ఉన్నాయి. మూడు వారాలు ముగిసేసరికి ఈ చిత్రం 2.48 మిలియన్ డాలర్లను వసూలు చేయగా.. నిన్నటితో ఈ వసూళ్లు 2.5 మిలియన్ల మార్కును అందుకున్నాయి. ఓ స్థాయి బడ్జెట్ లో రూపొందిన ఇంత మొత్తం అన్నది నిజంగా అపూర్వమైన ఫీట్ అనాల్సిందే. ఎందుకంటే.. ఇప్పటికే మెగాస్టార్ ఖైదీ నంబర్ 150.. త్రివిక్రమ్ శ్రీనివాస్ అఆ చిత్రాలను కూడా మహానటి దాటేసింది.
ఇప్పుడు ఈ చిత్రం కంటే ముందు అత్యధిక వసూళ్లతో.. బాహుబలి.. బాహుబలి2.. రంగస్థలం.. భరత్ అనే నేను.. శ్రీమంతుడు చిత్రాలు ఉన్నాయి. అంటే ఓవర్సీస్ కలెక్షన్స్ టాప్ 6గా మహానటి నిలిచింది. ఇక్కడి నుంచి శ్రీమంతుడు చిత్రం దగ్గరకు వెళ్లేందుకు చాలానే గ్యాప్ ఉండడంతో.. ఆ మార్కును అందుకోవడం కష్టమే కావచ్చు కానీ.. మహానటికి ఇలా టాప్6 కు చేరడం కూడా పెద్ద ఘనతగానే చెప్పాలి.