ఎన్టీఆర్ మచ్చను మాయం చేశారే

Update: 2018-05-31 11:38 GMT
మహానటి దూకుడు కాస్త తగ్గాక అందులో మొదట కనిపించని చిన్న చిన్న లోపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మరీ వంక పెట్టేవి కాకపోయినా బయోపిక్ అని క్లెయిమ్ చేసినప్పుడు అందులో పాత్రధారులకు  నిజమైన పేర్లు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కామెంట్స్ రావడం సహజం. విడుదలైన టైంలోనే ఎస్వి రంగారావు గారి పాత్రను గోరింటాకు షూటింగ్ టైంలో సావిత్రి గారిని కలిసినట్టుగా ఎలా చూపిస్తారు అని ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ఆయన ఆ సినిమా సమయానికి ఈ లోకంలో లేరు. నాగ అశ్విన్ ఏదో కవర్ చేసుకున్నాడు కానీ నిజానికి ఆ సంఘటన జరిగింది గుమ్మడి-సావిత్రి గారి మధ్య. ఒక పాత యు ట్యూబ్ ఇంటర్వ్యూలో గుమ్మడి ఈ విషయాన్నీ స్వయంగా చెప్పడం అందులో ఉంది. అది పక్కన పెడితే స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఒప్పుకొని కారణంగా కేవలం ఒక్క సీన్ అది కూడా గ్రాఫిక్స్ కు పరిమితం చేసిన సంగతి తెలిసిందే.

సరిగ్గా అదే పాయింట్ ను పట్టుకున్నారు నెటిజెన్లు. ఎన్టీఆర్ వీపు వెనుక భాగంలో  పెద్ద కాసంత సైజులో పుట్టు మచ్చ ఉండేది. అది ఆయన చొక్కా లేకుండా వేసిన ప్రతి పౌరాణిక పాత్రలో స్పష్టంగా కనిపించేది. అది ఒక ఆకర్షణగా కూడా మారింది. ఎంతగా అంటే ఆ టైంలో ఎవరికైనా అలా మచ్చ ఉంటె నువ్వు ఎన్టీవోడు అంత గొప్పవాడు అవుతావు అని అలాంటి వ్యక్తులను ఆట పట్టించేవారు. కానీ చూపించిన గ్రాఫిక్ షాట్ లో మాత్రం ఆ మచ్చ లేదు. బహుశా మర్చిపోయి ఉండవచ్చు తప్ప మచ్చ చూపకపోవడం మాత్రం పొరపాటే. అదే అడుగుతున్నారు కొందరు. ఎన్టీఆర్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఇది కొంచెం ఎంచదగ్గ లోపంగా అనిపించడం సహజం. నాగ అశ్విన్ దాకా ఈ విషయం వెళ్లిందో లేదో కానీ విన్నవారు మాత్రం అవును నిజమే కదా ఈ ఒక్కటి చూసుకుని ఉంటే సరిపోయేది అంటున్నారు.
Tags:    

Similar News