లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరి సమంత ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తోందనే విషయంలో చాన్నాళ్ల పాటు సస్పెన్స్ నడిచింది. ముందుగా సామ్ ఇందులో జర్నలిస్టు అన్నారు. ఆ తర్వాత జమున పాత్ర చేస్తోందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఆమెది జమున పాత్రేనట. ఐతే జమున పాత్రను సినిమాలో చూపిస్తున్నపుడు చిత్ర బృందం ఆమెను కలిసి సావిత్రితో ఆమె బంధం గురించి వివరాలు తెలుసుకుని ఉంటుందనే అంతా అనుకుంటారు. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ కానీ.. మిగతా యూనిట్ సభ్యులు కానీ జమునను కలవనే లేదట. నిర్మాత అశ్వినీదత్ కూడా జమునకు ఫోన్ చేసి అనుమతి తీసుకోవడం లాంటిదేమీ జరగలేదట.
సావిత్రి అంటే జమునకు అసూయ ఉండదేని.. కాబట్టి ఆ మేరకు సినిమాలో జమున పాత్రను కొంచెం నెగెటివ్ గా చూపిస్తున్నారని.. అందుకే జమునతో సంప్రదింపులు జరపలేదని ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే సినిమా చూసి జమున ఊరుకుంటుందా అన్నది డౌటు. తన పాత్రను తప్పుగా చూపించారంటూ ఆమె న్యాయపోరాటానికి దిగితే పరిస్థితి ఏంటన్న చర్చా నడుస్తోంది. ఐతే ఈ వయసులో జమున అలాంటి పని చేయకపోవచ్చని.. ఒకవేళ ఆమె నొచ్చుకుంటే సారీ చెప్పి మేనేజ్ చేద్దామని చిత్ర బృందం భావిస్తోందట. ఈ చిత్రం వేసవి చివర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.