నాన్ బాహుబలిని క్రాస్ చేయని మహర్షి

Update: 2019-05-10 07:13 GMT
మంచి సీజన్ ని టార్గెట్ చేసుకుంటూ టికెట్ ధరల పెంపు అదనపు షోలు లాంటి అనుకూలాంశాల మధ్య విడుదలైన మహేష్ బాబు మహర్షి అందరూ ఆశించినట్టు ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో టాప్ 3 లో చేరలేకపోయింది. నిజానికి ఇది చాలా షాకిచ్చే అంశం. పోటీగా వేరే ఏ సినిమా లేదు. జనమంతా వేసవి సెలవుల్లో ఉన్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం థియేటర్ వెళ్లడమే ప్రధాన అజెండా.

చూస్తే అన్ని ఊళ్లల్లో స్క్రీన్లన్ని మహర్షితోనే నిండి ఉన్నాయి. అలాంటప్పుడు సూపర్ స్టార్ మహేష్ లాంటి హీరో మూవీ అంటే రికార్డులు బద్దలు కావాలి. కానీ అది జరగలేదని ట్రేడ్ టాక్. విశ్వసనీయ సమాచారం మేరకు మహర్షి ఫస్ట్ డే 24 కోట్ల 18 లక్షల దాకా షేర్ వచ్చినట్టు సమాచారం. ఇది ఇప్పటిదాకా వచ్చిన టాప్ టాలీవుడ్ ఓపెనర్స్ లో ఐదో స్థానాన్ని ఇచ్చింది

బాహుబలి టూ మొదటిరోజు 42 కోట్ల 86 లక్షలతో టాప్ ప్లేస్ లో ఉండగా ఆ తర్వాత స్థానంలో 26 కోట్ల 60 లక్షలతో అరవింద సమేత వీర రాఘవ ఉంది. మూడో ప్లేస్ అజ్ఞాతవాసి 26 కోట్ల 30 లక్షలతో ఉండగా నాలుగో స్థానాన్ని 26 కోట్ల 3 లక్షలతో వినయ విధేయ రామ తీసుకుంది. విచిత్రంగా మహర్షి 24 కోట్ల 18 కోట్ల దగ్గరే ఆగిపోయింది.

ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ మహర్షి బాహుబలి 2నే కాకుండా లిస్ట్ లో ఉన్న రెండు డిజాస్టర్స్ ని సైతం క్రాస్ చేయలేకపోవడం షాకిచ్చే పరిణామమే. సరే టాక్ యునానిమస్ గా వస్తే రంగస్థలం తరహాలో తర్వాత దున్నేయొచ్చు. కానీ డివైడ్ టాక్ కొంత ప్రభావం చూపిస్తోంది. వీకెండ్ అయ్యాక దీనికి సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
    

Tags:    

Similar News