'మహర్షి' రైతు తాత ఇక లేరు!

Update: 2022-09-10 04:33 GMT
ఒక పెద్ద హీరో సినిమాలో ఒక చిన్న పాత్ర ప్రేక్షకులకు అలా గుర్తిండిపోవటం అంటే..ఆ పాత్ర స్వభావం మాత్రమే కాదు.. దాన్ని పోషించిన నటుడు కూడా కారణమే అవుతారు. మహేశ్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మహర్షి'లో రైతు పాత్ర కూడా అలాంటిదే.

'నాకు వ్యవసాయం నేర్పుతావా తాత' అని మహేశ్ అడిగితే.. ఆ సందర్భంగా చెప్పే డైలాగు.. దాన్ని పలికే విధానం ఇట్టే ఆకట్టుకోవటమే కాదు.. సినిమా చూసి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆ పాత్ర అలా గుర్తుండిపోతుంది. రైతు పాత్రలో నటించిన నటుడు గురుస్వామి ఇక లేరు.

కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. చదువుకున్నది అక్కడే. కొన్నిరోజులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల నేపథ్యంలో జాబ్ చేస్తూనే.. యాక్టింగ్ వైపునకు వచ్చారు. నాటకాల మీద అభిమానం.. అనురక్తితో విజేత ఆర్ట్స్ పేరుతో సంస్థను స్థాపించి కొన్ని నాటకాలు వేశారు.

2019లో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షిలో ఆ సినిమాను కీలక మలుపు తిప్పే రైతు పాత్రలో ఆయన నటించారు. తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రేక్షకులకు మహర్షి రైతుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణంపై చిత్ర రంగ ప్రముఖులుపలువురు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News