సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ జనవరి 18న ప్రారంభం అయ్యింది. సుదీర్ఘ విరామం తర్వాత సెకండ్ షెడ్యుల్ ని మొదలు పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ ఈ షెడ్యూల్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మలయాళీ నటి శోభనని ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కాకుండా ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి ఈ సినిమా కథని త్రివిక్రమ్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే నిర్మాత నాగవంశీ ఎనౌన్స్ చేసేశారు. ఆగష్టు 11న ఈ మూవీ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం మరో ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాని గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథతో త్రివిక్రమ్ సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తుంది.
గుంటూరు నేపధ్యం అంటే కచ్చితంగా పల్నాడు రాజకీయాలని, అలాగే రాజకీయ గొడవలని టచ్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ సినిమాలు అన్ని కూడా పూర్తిగా ఉన్నత కుటుంబాలలో జరిగిన కథలుగానే చూపించేవారు. అలాగే హీరోని ఒక బిజినెస్ టైకూన్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆవిష్కరించే వారు. అయితే ఈ సారి మాత్రం మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూ కథని చెప్పడానికి త్రివిక్రమ్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే కథని గుంటూరు నేపధ్యంలో తెరకెక్కి స్తున్నారని టాక్. ఇక దీనికోసం గుంటూరు పరిసరాలలో కొన్ని షెడ్యూల్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే అక్కడ ఎప్పుడు షూటింగ్ ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. విలేజ్ నేటివిటీ కూడా సినిమాలో టచ్ చేయబోతున్నారని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.