మహేష్ 26 టైటిల్ లాక్ చేశారా?

Update: 2019-05-30 07:19 GMT
మహర్షి సందడి కొలిక్కి వచ్చేసింది కాబట్టి అందరి దృష్టి మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందబోయే మూవీ మీద పడుతోంది. లాంచనంగా రేపు ప్రారంభిస్తున్నా రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ చివరి నుంచి కొనసాగబోతున్నట్టు తెలిసింది. ఇక దీని టైటిల్ గురించి గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి దాదాపుగా చెక్ పడినట్టు సమాచారం.

ముందు లీకైన టైటిల్ సరిలేరు నీకెవ్వరునే ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు ఫిలిం చాంబర్ లో దీన్ని రిజిస్టర్ చేసినట్టుగా తెలిసింది. ఇది ముందస్తు జాగ్రత్త తీసుకున్న చర్యనా లేక ఇది ఫిక్స్ చేసే ఆలోచనతో ఇలా చేశారా అనే క్లారిటీ లేదు. రెడ్డి గారి అబ్బాయి అనే మరో పేరు కూడా హల్చల్ చేసింది కాని అది లేనట్టే అనిపిస్తోంది. షూటింగ్ వీలైనంత త్వరగా ఆరు నెలల్లో పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరుకు ఫైనల్ కాపీ రెడీ చేసేలా అనిల్ రావిపూడి పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు తెలిసింది.

అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండటం మరో ఆకర్షణగా నిలుస్తోంది. రష్మిక మందన్న హీరొయిన్ గా చేస్తున్న ఈ మూవీ ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అనే దాని గురించి కూడా రేపే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న మహేష్ 26కి గట్టి పోటీనే స్వాగతం చెబుతోంది.


Tags:    

Similar News