టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈయన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. విలక్షణ నటుడు సముద్రఖని పవర్ ఫుల్ విలన్ గా అలరించబోతున్నారు. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కథ ఫస్ట్ హాఫ్ యుఎస్ లో నడిస్తే.. సెకండ్ హాఫ్ వైజాగ్ లో ఉంటుంది.
కొద్ది రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ వేరె లెవల్ లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహేశ్ సైతం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్.. సర్కారు వారి పాటలో విలన్ గా చేసిన నటుడు సముద్రఖనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కళ్లజోడు షాపు కొనివ్వాలని ఉంది అంటూ ఆసక్తికర స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈ సినిమాకు విలన్ గా ఎంతో మందిని పరిశీలించారట. ఆ టైమ్ లోనే మహేశ్ సముద్రఖనిని సజెస్ట్ చేయడంతో పరశురామ్ వెంటనే ఓకే చెప్పేశారట. ఆయన పాత్ర చాలా ఫ్రెష్ గా, సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తాజా ఇంటర్వ్యూలో మహేశ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, త్వరలోనే ఆయనకు ఓ కళ్లజోడు షాపు కొనిస్తా అని మహేశ్ పేర్కొన్నారు. ఎందుకు అలా అన్నానో కూడా ఆయన వివరణ ఇచ్చారు.
మహేశ్ మాట్లాడుతూ..''సముద్రఖనికి కళ్లజోళ్ల సేకరణ బాగా అలవాటు. ఎక్కడకు వెళ్లినా కళ్లజోళ్లను కొనుగోలు చేస్తారు. సర్కారు వారి పాటలో నేను చాలా కళ్ల జోళ్లు వాడాను. అవి ఆయనకు ఎంతగానో నచ్చడంతో ఓ రోజు నా దగ్గరకు వచ్చి 'మీరు వాడిన కళ్లజోడు ఒకటి ఇస్తారా.. మీ గుర్తుగా దాచుకుంటా' అని అన్నారు. ఆ తర్వాత నేను సినిమా చూశారు. అందులో సముద్రఖని నటన నన్ను మిస్మరైజ్ చేసింది. ఆయన నటన చూశాక.. ఒకటేంటి.. ఆయనకోసం కళ్లజోళ్ల షాపే ఇవ్వాలని అనిపించింది. ఆయనతో కలిసి నటించడం మంచి ఎక్స్ పిరియన్స్'' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మహేశ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, సముద్రఖని విషయానికి వస్తే.. డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన ఓ తమిళ్ మూవీతో నటుడిగా మారారు. 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఈయన విలన్ గా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ హిట్ అవ్వడమే కాదు సముద్రఖని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత 'క్రాక్'లో మరోసారి తన నటనా విశ్వరూపం చూపించడంతో.. అనతి కాలంలోనే ఈయన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా ముద్ర వేయించుకున్నారు.