టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు.. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసి దుబాయ్ టూర్ లో ఉన్నాడు. ఈనెలలో రెండో షెడ్యూల్ ని చెన్నైలో మొదలెట్టేస్తున్నాడు కూడా. మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు-తమిళం భాషల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. స్టార్ట్ చేసేనాటికి ప్లానింగ్స్ సంగతేమో కానీ.. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్న స్పీడ్ ప్రకారం.. మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు మురుగదాస్.
మహేష్ బాబుతో తను చేస్తున్న సినిమా కచ్చితంగా సమ్మర్ కి విడుదల అవుతుందంటూ చెప్పేశాడు మురుగదాస్. ఏప్రిల్ లో బాహుబలి2 రిలీజ్ కానుండడంతో.. మరోసారి మే నెలపైనే మహేష్ మూవీ వస్తుందని ఫిక్స్ అవచ్చు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గర సూపర్ స్టార్ ఫ్యాన్స్.. తెగ ఫీలయిపోతున్నారు. తమ హీరోకి ఆ నెల ఏ మాత్రం అచ్చి రాలేదన్నది వారి ఫీలింగ్. మహేష్ ట్రాక్ రికార్డ్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది కూడా.
సమ్మర్లో మహేష్ అనగానే.. ఫ్యాన్స్ కి ఈ ఏడాది వేసవిలో వచ్చి సూపర్ స్టార్ కెరీర్ లో పీడకలలా నిలిచిపోయి బ్రహ్మోత్సవం గుర్తొస్తోంది. 2004 లో తేజ డైరెక్షన్ లో నిజం.. 2003లో ఎస్ జే సూర్య దర్శకత్వంలో నాని వచ్చి.. డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ మే నెల పేరు చెబితే బోలెడంత ఫీలయిపోతున్నారు. అచ్చి రాని సమ్మర్ మనకెందుకు మహేషూ అనుకుంటున్నారు.