మహేష్‌-శృతి.. బన్నీ-అనుష్క.. ది బెస్ట్

Update: 2016-07-01 04:09 GMT
ఇక సైమా 2016 అవార్డుల తొలిరోజు చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఘనంగా వెల్కమ్ చెబుతూ సైమా ఫుల్లుగా కిక్కిచ్చింది. ఇకపోతే ఈ అవార్డుల్లో తెలుగులో బెస్ట్ యాక్టర్‌ మరి యాక్ర్టెస్ అవార్డులను అందుకున్న స్టార్లను చూస్తే.. ఫ్యాన్సుకు ఫుల్‌ ఖుషీ అనే చెప్పాలి.

బెస్ట్ యాక్టర్‌ గా మహేష్‌ బాబు 'శ్రీమంతుడు' పెర్ఫామెన్సుకు గాను అవార్డును అందుకుంటే.. ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్‌ అవార్డును అల్లు అర్జున్ అందుకున్నాడు. గోన గన్నారెడ్డిగా 'రుద్రమదేవి'లో మనోడు ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శను విమర్శకులను సైతం ఎలా కట్టిపాడేసిందో ఇది చూసి తెలుసుకోవచ్చు. ఇక అమ్మాయిల విషయానికొస్తే.. 'శ్రీమంతుడు'లో హీరోను మోటివేట్‌ చేసే విలేజ్ గాళ్‌ గా శృతి హాసన్‌ ఇచ్చిన ప్రదర్శనకే ఎక్కువమంది ఓటేశారు. అందుకే ఆ అవార్డు ఆమెనే వరించింది. బెస్ట్ యాక్టర్‌ (ఫిమేల్) ట్రోఫీ అందుకున్న శృతి ఆనందానికి హద్దుల్లేవనుకోండి. మరి క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి దగ్గరకు వస్తే.. 'రుద్రమదేవి'కి గాను అనుష్క ఆ అవార్డును అందుకుంది.

బాహుబలి సినిమాకు ఉత్తమ సినిమా.. రాజమౌళి బెస్ట్ డైరక్టర్.. దేవిశ్రీప్రసాద్‌ (శ్రీమంతుడు) బెస్ట్ మ్యూజిక్‌ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది సైమా అవార్డుల్లో బాహుబలి సినిమాకు 7 అవార్డుల రాగా.. శ్రీమంతుడుకి కూడా 6 అవార్డులు వచ్చాయి. సాంగ్ ఆఫ్‌ ది ఇయర్ అనే క్యాటగిరీ తీసేస్తే.. ఇండివిడ్యుయల్‌ టాలెంట్సలో శ్రీమంతుడుకు 5 అవార్డులు వచ్చినట్లు.
Tags:    

Similar News