కొడుకుతో మహేష్‌ ఏం చేశాడంటే...

Update: 2018-01-03 04:56 GMT
తెలుగులో స్టార్ ఇమేజ్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు మహేష్ బాబు. అయినా మహేష్ యాటిట్యూడ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలు.. ఫ్యామిలీ ఈ రెండే ప్రపంచం అన్నట్టుగా ఉంటాడు. పార్టీలు.. పబ్లిక్ ఈవెంట్లలో అరుదుగా కనిపిస్తుంటాడు. సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడు. హమేష్ భార్య నమ్రత మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విశేషాలు పంచుకుంటుంది. దానివల్లనే అభిమానులకు మహేష్ పర్సనల్ విషయాలు కాస్తయినా తెలుస్తుంటాయి.

మహేష్ కు షూటింగుల్లో గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ ను వెకేషన్ కు తీసుకెళ్తుంటాడు. అలా ఈమధ్య ఒమన్ కు కూడా వెళ్లొచ్చాడు. ఈ సందర్భంగా పారా గ్లైడింగ్ చేశాడు. మహేష్ తోపాటు అతడి కొడుకు గౌతమ్ కూడా తండ్రితో పాటు ఉత్సాహంగా పారా గ్లైడింగ్ చేశాడు. రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరిపోయే అనుభూతిని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతుండగా క్లిక్ మనిపించిన ఫొటోను నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘‘పారాగ్లైడర్లుగా నా సూపర్ హీరోలు.. తండ్రిలాగే కొడుకు’’ అంటూ కామెంట్ పెట్టి మరీ తన సంతోషాన్ని పంచుకుంది. దీనిని చూసిన మహేష్ అభిమానులంతా అతడి పుత్రప్రేమను చూసి అభినందనలతో ముంచెత్తారు.

మహేష్ కెరీర్ లో తొలిసారి మురుగదాస్ డైరెక్షన్ లో చేసిన బైలింగ్వువల్ ఫిలిం స్పైడర్ బాక్సాఫీసును తీవ్రంగా నిరాశపరిచింది. తనకు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న ‘‘భరత్ అనే నేను’’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. దీనిలో మహేష్ కెరీర్ లో ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడనే సమాచారం అభిమానుల్లో అంచనాలు మరింత పెంచుతోంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది.
Tags:    

Similar News