సినిమాల విషయం లో మహేష్ త్వరగా నిర్ణయం తీసుకోలేడన్నది అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మహేష్ స్పీడ్ గా ఒకే చేసిన కథ 'సరిలేరు నీకెవ్వరు' మాత్రమే. మహర్షి కథ విని కూడా వంశీ ను కొన్నేళ్ళు వెయిటింగ్ లో పెట్టాడు. సుకుమార్ చెప్పిన కథ గురించి కొన్ని నెలలు బాగా ఆలోచించి వద్దనుకున్నాడు. అయితే తాజాగా సూపర్ స్టార్ మరో డైరెక్టర్ విషయం లోనూ అద్ చేసాడు.
'గీత గోవిందం'తో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం బుజ్జి మహేష్ కి ఓ కథ వినిపించాడు. మూడు సిట్టింగ్స్ తర్వాత మహేష్ కథను లాక్ చేసాడు. కానీ బుజ్జి ని వెయిట్ చేయమని ఆర్డర్ వేసాడు. ఈ లోపు కావాలంటే ఓ సినిమా చేసుకొని రమ్మని చెప్పాడట. అందుకే ఉన్నపళంగా నాగ చైతన్య కి మరో కథ వినిపించి ఆ సినిమాను అనౌన్స్ మెంట్ చేసాడు పరశురాం.
ప్రస్తుతం మహేష్ ఫోకస్ అంతా సరిలేరు నీకెవ్వరు రిజల్ట్ మీదే ఉంది. ఈ సినిమాతో మళ్ళీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని చూస్తున్నాడు. మరో వైపు బన్నీ సినిమా పోటీలో ఉండటంతో ఎలాగైనా తనదే పై చెయి కావాలని ఆరాటపడుతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తెలుసుకున్నాకే వంశీ పైడిపల్లి సినిమా షెడ్యుల్స్ ప్లాన్ చేసుకుంటాడు. సో వంశీ తర్వాత పరశురాం కె ఫిక్సవుతాడా ? లేదా వెయిటింగ్ లో పెట్టిన మరో డైరెక్టర్ తో ఏదైనా సినిమా అనౌన్స్ చేస్తాడా చూడాలి.