ప్రపంచంలో మిగిలిన మగాళ్లు మనం ఇద్దరమే : మహేష్ - రణ్ వీర్

Update: 2020-12-27 09:00 GMT
‘ప్రపంచంలో చివరగా మగాళ్లం మనమిద్దరమే ఉన్నామనుకుంటా..’ అని రణ్ వీర్ సింగ్ అడగ్గా.. ‘ఇంకెవరైనా ఉంటే.. అక్కడే ఉంటారు.’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మహేష్ బాబు. వీరిద్దరూ కలిసి థమ్స్ అప్ యాడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్ కు సంబంధించిన ఓ బిట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు ప్రిన్స్.

ఈ సీన్ లో పూర్తిగా ధ్వంసమైన నగరాన్ని చూపించారు. అప్పటికే పోరాటంలో పాల్గొని శతృవులను మట్టి కరిపించిన వీరుల్లా కనిపించారు మహేష్, రణ్ వీర్. ఈ సందర్భంగా ఓ బిల్డింగ్ నుంచి నగరాన్ని చూస్తున్న రణ్ వీర్.. ‘ప్రపంచంలో చివరగా మగాళ్లం మనమిద్దరమే ఉన్నామనుకుంటా..’ అని ప్రశ్నిస్తాడు. వెనక నుంచి వచ్చిన మహేష్ బైనాక్యులర్ ద్వారా నగరాన్ని చూస్తూ.. ‘ఇంకెవరైనా ఉంటే.. అక్కడే ఉంటారు.’ అంటూ ఆన్సర్ ఇస్తాడు. ఎదురుగా చూస్తే.. థమ్స్ అప్ కూల్ డ్రింక్ లోగో కనిపిస్తూ ఉంటుంది.

ఈ వీడియోను షేర్ చేసిన మహేష్.. ‘సమ్ థింగ్ హ్యూజ్ ఈజ్ కమింగ్ యువర్ వే’ అని ట్వీట్ చేశారు. ఈ యాడ్ మొత్తం మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ కాబోతోందని చెప్తూ.. ‘చెక్ ఔట్ 3 PM’ అని థమ్స్ అప్ అఫిషియల్ అకౌంట్ ను ట్యాగ్ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News