సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే కదా. ఇది మహేష్ బాబుకు తన కెరీర్ లో 25వ చిత్రం. ఈ సినిమా తర్వాత మహేష్ ఇద్దరు డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకరు సుకుమార్ కాగా మరొకరు సందీప్ రెడ్డి వంగా.
సుకుమార్-మహేష్ ప్రాజెక్టుకు మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలు. మరోవైపు సందీప్ వంగా సినిమాను కూడా మైత్రీ వారే నిర్మించవలసి ఉందట. ఎందుకంటే అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ చేసేందుకు వారు సందీప్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇప్పుడు మహేష్-సుకుమార్ ప్రాజెక్ట్ కూడా చేతిలో ఉండడంతో సందీప్ ప్రాజెక్ట్ ను గీతా వారికి ఇచ్చారట. దానికి కారణం గీతా ఆర్ట్స్ వారి చేతిలో మహేష్ బాబు డేట్స్ ఉండడమే. దీంతో #మహేష్ 27 గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతుందన్నమాట. దీనికంటే ముందుగా మహేష్-సుకుమార్ ప్రాజెక్ట్ #మహేష్ 26 సెట్స్ మీదకు వెళ్తుంది.
ఇక సందీప్ ప్రస్తుతం 'అర్జున్ రెడ్డి' హిందీ రిమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కంప్లీట్ కాగానే మహేష్ బాబు సినిమాకు వర్క్ చేయడం మొదలు పెడతాడట సందీప్.