భరత్ అనే నేను సినిమాతో మొత్తానికి మహేష్ బాబు తన ఫ్లాప్ లిస్ట్ కి గట్టిగా బ్రేక్ వేశాడు. కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ అందుకొని తన స్టార్ స్టామినాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 24 చిత్రాలను పూర్తి చేసుకున్న మహేష్ నెక్స్ట్ తన సిల్వర్ జూబ్లీ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పై కూడా అంచనాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో కొత్త మహేష్ ను చూస్తామట.
ఇప్పటివరకు మహేష్ ఎన్నో వినూత్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. గ్లామర్ ని మెయింటైన్ చేయాలి అంటే మహేష్ తరువాతే ఎవరైనా. అయితే ఈ సూర్ స్టార్ వంశీ ప్రాజెక్ట్ లో కూడా కొత్త హెయిర్ స్టైల్ ని చుపించనున్నాడట. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొత్తం అయిపొయింది. లొకేషన్స్ విషయంలో దర్శకుడు వివిధ దేశాల ప్రముఖ నగరాలను చుట్టేశాడు. ముఖ్యంగా అమెరికాలో కొత్త లొకేషన్స్ ఈ సినిమా లో కనిపిస్తాయని చెబుతున్నారు.
ఫైనల్ గా జూన్ సెకండ్ వీక్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారు. ఎక్కువగా యూఎస్ - నార్త్ ఇండియాలో షూటింగ్ చేస్తారట. ఇక సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ స్నేహితుడిగా కామెడీ హీరో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. దిల్ రాజు - సి.అశ్వినీదత్ గారు మహేష్ 25వ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.