చాలామంది సెలబ్రిటీలు ట్విట్టర్ లో ఉన్నారు. వాళ్లలో తరచుగా ట్వీటేవాళ్లు చాలామందే. అయితే మహేష్ మాత్రం ఇంపార్టెంట్ అనుకొంటే తప్ప ట్విట్టర్ లో కనిపించరు. తన సినిమాలకి సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్లు, తన హ్యాపీనెస్ ట్విట్టర్ ద్వారా పంచుకొంటూ ఉంటాడు. అనవసరమైన విషయాల్ని మాత్రం అందులో పెట్టడు. `అలాంటి ట్వీట్ల వల్ల నా టైమ్ వేస్ట్, చదివేవాళ్ల టైమ్ వేస్ట్...` అంటుంటాడు మహేష్. అందుకే ఆయన్నుంచి ట్వీట్ ఎప్పుడో కానీ రాదు. ఒకవేళ ట్వీట్ పెట్టాడంటే మాత్రం అది న్యూస్ అయిపోతుంటుంది.
`శ్రీమంతుడు` సినిమాకి తానూ ఓ నిర్మాత కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ కోసం ట్విట్టర్ ని బాగానే వాడుకొన్నాడు మహేష్. ఫస్ట్ లుక్ నీ, టీజర్ నీ, ట్రైలర్ నీ, సినిమాకి వచ్చిన రెస్పాన్స్ నీ, ఇప్పుడు మేకింగ్ వీడియోని... ఇలా బోలెడన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. యూనిట్ కీ, ప్రేక్షకులకీ థ్యాంక్స్ కూడా ట్విట్టర్ ద్వారానే చెప్పుకొన్నాడు. అయితే బుధవారం పొద్దు పొద్దున్నే మహేష్ నుంచి పైరసీ పై ఓ ట్వీట్ వచ్చింది. `నా సినిమాల్ని థియేటర్లోనే చూడండి. పైరసీ ని చంపండి` అని ఓ ట్వీట్ పెట్టాడు మహేష్. అభిమానులు పైరసీని నిర్మూలించేందుకు ప్రయత్నించడని అందులో కోరాడు. అంత పొద్దున్నే మహేష్ పైరసీ గురించి ట్వీటాడంటే ఆయనకి ఏదో న్యూస్ తెలిసే ఉంటుందనీ, అందుకే పైరసీ గురించి ప్రత్యేకంగా అభిమానులకు పిలుపునిచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల పైరసీని అరికట్టేందుకు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నా ఆగడం లేదు. ఎక్కడో ఒకచోట పైరసీ వెలుగు చూస్తూనే ఉంది. అందుకే `శ్రీమంతుడు` టీమ్ బాగా భయపడుతోంది. శ్రీమంతుడుకి ఈ వారం చాలా కీలకం. సూపర్ హిట్టు టాక్ వచ్చేసింది కాబట్టి ఈ వారమంతా పైరసీలాంటివి జరగకుండా చూస్తే సినిమా లాభాలపంట పండించడం ఖాయం. అందుకే మహేష్ తన అభిమానులకి పైరసీని నిర్మూలించమని పిలుపునిచ్చాడు.