మహేష్ మూవీ ఆల్బమ్ అంతా??

Update: 2017-12-01 13:31 GMT
బ్రహ్మోత్సవం - స్పైడర్ సినిమాలతో ఊహించని విధంగా డిజాస్టర్స్ ని అందుకున్న మహేష్ బాబు తరువాత భరత్ అనే నేను సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఒక డిజాస్టర్ అందుకోగానే హీరో నెక్స్ట్ సినిమాపై చాలా ప్రభావమే చూపుతుంది. కానీ ఇప్పుడు మహేష్ చేస్తున్న సినిమాపై ఆ ప్రభావం వన్ పర్సెంట్ కూడా కనిపించడం లేదని ఈజీగా అర్ధమవుతోంది. ఎందుకంటే భరత్ అనే నేను ఆడియో హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోయాయి.

కొరటాల శివతో శ్రీమంతుడు సినిమా చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు మరో సినిమా చేస్తుండడంతో అంచనాలు చాలా పెరిగిపోయాయి. అంతే కాకుండా దేవి శ్రీ ప్రసాద్ కూడా మరోసారి ఈ కాంబినేషన్ కి మ్యూజిక్ అందిస్తుండడంతో ఆల్బమ్ కూడా హిట్ అవ్వడం పక్కా అని కొన్ని కంపెనీలు చాలా పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ గా లహరి మ్యూజిక్ కంపెనీ మ్యూజిక్ రైట్స్ ను  చేజిక్కించుకుంది.

మొత్తంగా ఆడియో - వీడియో లతో కలిపి రూ.1.90కోట్లకు (GST తో కలిపి) లహరి హక్కులను సొంతం చేసుకుందట. దీంతో సినిమాపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. కియారా అద్వాని హీరోయిన్ గా తెలుగులో తెరంగేట్రం చేస్తోంది. ఇక సినిమాను భారి బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది 2018 ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News