టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2015లో విడుదలైన ఆ చిత్రానికిగానూ మహేష్ ఉత్తమ నటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు. ఆ చిత్రం తర్వాత భారీ అంచనాలతో విడుదలైన బ్రహ్మోత్సవం చిత్రం మహేష్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన స్పైడర్ చిత్రం కూడా మహేష్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాతో కోలీవుడ్ లో పాగా వేయాలనుకున్న ప్రిన్స్ కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో, బ్రహ్మోత్సవం సినిమాను తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బ్రహ్మోత్సవం తమిళ వెర్షన్ కు `అనిరుధ్` అనే టైటిల్ కూడా ఫిక్సయింది. ఈ సినిమాను భద్రకాళి ఫిలిమ్స్ సంస్థ కోలీవుడ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ వర్క్ ను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారట.
అయితే, సాధారణంగా ఓ భారీ డిజాస్టర్ నమోదైన తర్వాత మరో డిజాస్టర్ మూవీని విడుదల చేయాలని ఏ హీరో కూడా భావించడు. ఆ ఫ్లాప్ నుంచి కోలుకోవడానికి కొంత గ్యాప్ తీసుకొని మరో హిట్ చిత్రంతో మళ్లీ క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు కూడా ఇదే ఫార్ములాను అనుసరించారు. అయితే, ప్రిన్స్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. స్పైడర్ సినిమా గల్ఫ్ తో పాటు కొన్ని ఇతర భాషల్లో కూడా విడుదలయ్యేంత క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే బహుశా, స్పైడర్ చిత్రానికి ముందే భద్రకాళి సంస్థ నిర్మాతలు `అనిరుధ్` రిలీజ్ కు సన్నాహకాలు ప్రారంభించి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఇపుడు విడుదలను ఆపలేని పరిస్థితి ఉందేమో అన్న టాక్ ఉంది. అయితే, ప్రిన్స్ తలచుకుంటే ఆ విడుదలను ఆపడం పెద్ద కష్టమైన పనేమీ కాదని మరో వాదన కూడా ఉంది. ఏదేమైనా, అనిరుధ్ పై ప్రిన్స్ మేల్కోకుంటే తమిళ తంబీల దగ్గర మరోసారి భంగపాటు తప్పదేమో అన్న టాక్ వినిపిస్తోంది.