నిర్మాత భద్రకాళి ప్రసాద్ సాహసమే చేస్తున్నాడు. తన సితార ఎంటర్ టైనర్ సంస్థ సమర్పణలో మహేష్ బాబు సినిమాను తమిళంలోకి అనువదిస్తున్నారు. ‘అనిరుధ్’ పేరుతో ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పాటలు విడుదల చేశారు. అయితే మహేష్ బాబు ఏ సినిమాను అనువదిస్తున్నారో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే..
మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన మూవీ ‘బ్రహ్మోత్సవం..’ సమంత - కాజల్ - ప్రణీత హీరోయిన్లుగా.. సత్యరాజ్ - జయసుధ - రేవతి లాంటి భారీ తారగణం ఈ మూవీలో నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అయితే నిర్మాత భద్రకాళి ప్రసాద్ మాత్రం ‘బ్రహ్మోత్సవం’ను తమిళంలోకి అనువదించారు. ఇంతకుముందు ఈయన సెల్వందన్ - ప్రభాస్ బాహుబలి - ఇదుదాండా పోలీస్ - మగధీర - బ్రూస్ లీ - ఎవడు వంటి తెలుగు చిత్రాలను తమిళంలోకి అనువదించారు. ఇప్పుడు బ్రహ్మోత్సవంను ‘అనిరుధ్’ పేరుతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు..
ఆగస్టు3న అనిరుధ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. చిత్రంలోని పాటలకు ఇప్పటికే ప్రేక్షకాదరణ వచ్చిందని.. చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తమిళ అగ్రనటులు నాజర్ - రేవతి లాంటి వారు ఉండడంతో ఈ సినిమా ఆడుతుందని ధీమా వ్యక్తం చేశారు.