సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు సన్నిహితులతో ఏదైనా సంతోషకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని చాలా అరుదుగానే మిస్సవుతుంటారు. విదేశాల్లో అయినా స్వదేశంలో అయినా ఆయన తీరు ఇదే. అతడు టాలీవుడ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అయ్యింది ఇందుకే. తాజాగా మహేష్ భార్య నమ్రతా పంచుకున్న ఈ తాజా చిత్రం నిన్న రాత్రి ఘట్టమనేని కుటుంబం క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్లిక్ చేసినది
ఇలాంటి పండగలు పార్టీలు అంటే ఆయన స్నేహితులను అసలే విడువరు. నిన్న రాత్రి వేడుకలో కూడా `మహర్షి` దర్శకుడు వంశీ పైడిపల్లి అతని భార్య కుమార్తె తో పాటు మహేష్ కనిపిస్తారు. మహేష్ తన మచ్చలేని శైలి అందరికీ నచ్చుతుంది. స్నేహానికి విలువిచ్చే విధానం అతడి కి ప్రత్యేకతను ఆపాదించింది.
ప్రస్తుతం మహేష్ సర్కార్ వారి పాట సినిమాలో నటించనున్నారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి పైడిపల్లికి మహర్షి తర్వాత అవకాశం ఇచ్చినా స్క్రిప్టు పరంగా లాక్ చేయడంలో తడబడడంతో ఆఫర్ పరశురామ్ కి వెళ్లింది. అయినా పైడిపల్లి వంశీతో మహేష్ స్నేహం ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇక తన ఫ్రెండు మహేష్ కోసమే ఇంతకాలం వేచి చూస్తున్న పైడిపల్లి 2021లో స్క్రిప్ట్ లాక్ చేస్తాడనే మహేష్ అభిమానులు భావిస్తున్నారు.