హీరోయిన్లపై మహేష్‌ కంప్లయింట్‌

Update: 2016-05-18 11:30 GMT
''బ్రహ్మోత్సవం'' సినిమా క్యాస్టింగ్ విషయంలో చాలా కష్టపడ్డారా అని టీమ్‌ ను అడిగితే.. దీనిలో కష్టమేముంది.. అంతమంది నటీనటులను ఎంపిక చేసుకోవడం ఈజీయే. కాకపోతే వారిని హ్యాండిల్‌ చేసినందుకు శ్రీకాంత్‌ అడ్డాలకు ధన్యవాదాలు తెలపాలి అంటున్నారు. సూపర్‌ స్టార్ మహేష్‌ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే ఇంత పెద్ద క్యాస్టింగ్‌ లో హీరోయిన్ల విషయంలో చిక్కొచ్చిందంటే మీరు నమ్ముతారా? పదండి అసలు మహేష్‌ కంప్లయింట్‌ ఏంటో చూద్దాం.

అవును. ముందుగా సమంత ఓకె అయిపోయిన తరువాత.. ప్రణీతను తీసేసుకున్న తరువాత.. అసలు ఆ ఇంకో హీరోయిన్‌ పాత్రకు దాదాపు టాప్‌ స్టార్లందరినీ ఎప్రోచ్‌ అయ్యారట. అయితే ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకు వాళ్లకు స్ర్కిప్టు నచ్చలేదా? అబ్బే.. ముగ్గురు హీరోయిన్లు అనేసరికి వారు ముఖం చాటేశారట. ''అసలు మేం అడిగిన హీరోయిన్లు చేయడం చేయకపోవడం పక్కనుంచండి.. మనోళ్ళు కనీసం కథలను కూడా వినలేదు. కాజల్‌ రోల్‌ కు చాలామందిని ట్రై చేశాం. సమంత ఉంది.. ఇంకో హీరోయిన్‌ కూడా ఉంది అనగానే.. వారు నో చెప్పేశారు. కథ వినకుండా రోల్‌ రిజక్టు చేయడం అనేది షాకింగ్‌ విషయం'' అని చెప్పుకొచ్చాడు మహేష్‌ బాబు.

చివరకు ఒక రోజు చెన్నయ్‌ లో కాజల్‌ కు కథ చెప్పాడట శ్రీకాంత్‌ అడ్డాల. చెప్పిన వెంటనే ఒప్పేసుకుందట. అలాగే సమంత కూడా స్టోరీ విని వెంటనే ఒప్పేసుకుందట. అందుకే సమంత అండ్‌ కాజల్‌ కు స్పెషల్‌ థ్యాంక్స్ చెబుతున్నాడు సూపర్ స్టార్.
Tags:    

Similar News