అప్పట్లో ‘అర్జున్’ సినిమాకు ఒక వినూత్నమైన ప్రయోగం చేశారు మహేష్ బాబు-గుణశేఖర్. ‘అర్జున్’ అనే టైటిల్ పెట్టారు కానీ.. ఆ సినిమాలో ఎక్కడా హీరో పేరే పలకరు. చివర్లో శుభం కార్డు పడే ముందు ‘ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు కదా.. అర్జున్ నా పేరు’ అంటూ సినిమాకు ముగింపు పలుకుతాడు మహేష్. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విషయానికొస్తే మహేష్ తో పాటు వెంకటేష్ కు కూడా పేర్లుండవు. చిన్నోడు.. పెద్దోడు అనే ముద్దు పేర్లతోనే లాగించేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడిక ‘బ్రహ్మోత్సవం’లో అయినా మహేష్ కు పేరుంటుందేమో అంటే.. అలాంటిదేమీ లేదట. ఇందులోనూ మహేష్ పాత్రకు ఏ పేరూ పెట్టలేదట శ్రీకాంత్ అడ్డాల. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబే వెల్లడించాడు.
‘‘అవును ‘బ్రహ్మోత్సవం’లో కూడా నాకు ఏ పేరూ లేదు. మరి మిగతా పాత్రధారులు నన్నేమని పిలుస్తారో తెరమీదే చూడండి. ఇది శ్రీకాంత్ గారి స్టయిల్. ఇలా ఎలా సాధ్యం అని.. పేరు లేకుండా స్క్రిప్టు ఎలా తయారు చేస్తారని ఆయన్ని ఓసారి అడిగాను కూడా. ఐతే ప్రతి పాత్రకూ ఓ ఐడెంటిటీ ఉంటుందని.. పేరు పలకాల్సిన అవసరం రాకుండానే సన్నివేశాలు రాస్తానని శ్రీకాంత్ చెప్పాడు’’ అని మహేష్ వెల్లడించాడు. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించి తొలి రోజు షూటింగ్ ను తాను ఎప్పటికీ మరిచిపోలేనని మహేష్ చెప్పాడు. ‘‘ఆ రోజు గురించి ఎప్పుడు తలుచుకున్నా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. స్క్రిప్టు విన్నపుడే ఇందులో చాలా పాత్రలు ఉంటాయని అర్థమైంది. ఆయా పాత్రల్ని ఎవరు చేస్తారో తెలుసుకుని చాలా సంతోషించాను.
ఐతే తొలి రోజు షూటింగుకి వెళ్తే 25 మంది దాకా పేరున్న నటీనటులున్నారు. చాలా చిత్రంగా అనిపించింది. అంతమందితో కోఆర్డినేట్ చేసుకుని సన్నివేశాలు చేయడానికి అదోలా అనిపించింది. ఓ షాట్ తీయడానికి ముందు నేను, శ్రీకాంత్ మాట్లాడుకుంటుంటే అందరూ ఎదురు చూస్తుండేవాళ్లు. మరోలా ఫీలవుతారేమో అనిపించేది. ఓ పది రోజుల తర్వాత కానీ అలవాటు పడలేకపోయాం’’ అని మహేష్ చెప్పాడు.