మహేష్ బాబు 25వ చిత్రంగా రూపొందుతున్న 'మహర్షి' చిత్రం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో మొదటి సారి ఈ చిత్రంలో మహేష్ బాబు గడ్డం, మీసాలతో కనిపించబోతున్నాడు. పల్లెటూరు నేపథ్యంలోని సన్నివేశాలతో పాటు, విదేశాల్లో పెద్ద బిజినెస్ మన్ గా మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంకు సంబంధించిన పలు లుక్స్ ను రివీల్ చేశారు.
తాజాగా ఈచిత్రంకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహర్షి చిత్రంలో మహేష్ బాబు ఒక సీన్ లో క్రికెటర్ గా కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు మహేష్ బాబు క్రికెటర్ లుక్ లో కనిపించలేదు. మొదటి సారి ఈ చిత్రం కోసం క్రికెటర్ గా క్రీడాకారుడి జర్సీ వేసుకోబోతున్నాడు. మహేష్ బాబు తన 25వ చిత్రంలో అభిమానలను సర్ ప్రైజ్ చేసే విధంగా పలు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. కెరీర్ లో మొదటి సారి మహేష్ బాబు గడ్డం మీసాలతో కనిపించడంతో పాటు, క్రికెటర్ గా కనిపించబోతున్న నేపథ్యంలో సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో చిత్రీకరణ పూర్తి చేసుకోబోతుంది.