ఆ స్టెప్ మహేష్ ఎందుకు వేశాడో?

Update: 2016-05-21 15:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప డ్యాన్సర్ అయిపోయేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. తనకు కన్వీనియంట్ గా ఉండేలా సింపుల్ స్టెప్స్ తోనే పని కానిచ్చేయడం మహేష్ కు అలవాటు. ఇక ఫ్యాన్స్ గోల చేయడంతో.. డ్యాన్స్ ఇప్పుడు ఇరగదీశా అని చెప్పి మరీ.. 1-నేనొక్కడినే సినిమాలో కొంచెం ఇరగదీశాడు. కాని ఇప్పుడు ఏమనుకున్నాడో ఏమో.. బ్రహ్మోత్సవంలో అలాంటి డ్యాన్సు నెంబర్లు ఏవీ లేవు.

అయితే ఈ సినిమాలో ఒక మూవ్మెంట్‌ మాత్రం.. అసలు ఎందుకు చేశాడని మనం ఫీలవ్వాల్సిందే. కాజల్ తో వచ్చే రొమాంటిక్ కం డ్యాన్స్ నెంబర్ అయిన బాలా త్రిపుర మణి పాటలో.. మహేష్ బాబు ఓ సిగ్నేచర్ స్టెప్ వేస్తాడు. పాటంతా డ్యాన్సులు ఉన్నా.. ఒక స్టెప్ గురించి మాత్రం మాట్లాడుకోవాల్సిందే. ఓ సారి టీ షర్ట్ ని రెండు వేళ్లతో పెట్టుకుని ఊపడం.. ఒక చెయ్యో, కాలో వణికిపోతున్నట్లుగా కదిలించడాన్నే స్టెప్ అని చూపించాడు మహేష్. పైగా ఇదో సిగ్నేచర్ స్టెప్ మాదిరిగా 3-4 సార్లు పెట్టడం మరీ విచిత్రం.

నిజానికి 1 నేనొక్కడినే చిత్రం నుంచి మహేష్ డ్యాన్సులు బాగానే మారాయి. ఆ సినిమాలో అయితే మూన్ వాక్ రేంజ్ లో వేసిన మూవ్ మెంట్ అదుర్స్ అనాల్సిందే. శ్రీమంతుడులో పెద్దగా డ్యాన్సులు ట్రై చేయకపోయినా.. సింపుల్ గా బాగానే ఉంటాయి. అలా తన డ్యాన్సుల్లో కూడా ఛేంజ్ చూపిస్తున్న మహేష్.. ఇంతగా జనాలు షాకయ్యేలా.. ఫ్యాన్స్ హర్టయ్యేలా స్టెప్ ని వేయడం ఆశ్చర్యకరమే. ఈ సల్మాన్ ఖాన్‌ టైపు స్టెప్పులు మనకి ఎందుకు మహేష్‌?
Tags:    

Similar News