స‌మంత‌కు మ‌హేష్ కుమార్తె స‌ర్ ప్రైజ్!

Update: 2016-10-28 10:50 GMT
పిల్ల‌లు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే ఎంత ముచ్చ‌ట‌గా ఉంటుందో క‌దా! ప‌దాలు ప‌ట్టిప‌ట్టి పలుకుతూ ఉంటే విన‌డానికి భ‌లేగా ఉంటుంది. మ‌హేష్ బాబు కుమార్తె సితార కూడా ఇలానే ముద్దుగా మాట్లాడుతోంది! సినిమాల్లోని కొన్ని డైలాగుల్ని సింగిల్ టేక్ లో చెప్పేసింది. మ‌హేష్ బాబు - స‌మంత క‌లిసి న‌టించిన చిత్రం ‘బ్ర‌హ్మోత్స‌వం’. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయిలో ఈ చిత్రం స‌త్తా చాటుకోటేక‌పోయింద‌నుకోండి! అయితే, ఈ సినిమాలో స‌మంత చెప్పిన ఓ డైలాగును త‌న ముద్దుముద్దు మాట‌ల‌తో - క్యూట్ క్యూట్ ఎక్స్  ప్రెష‌న్స్ తో ఎంతో చ‌క్క‌గా చెప్పింది సితార‌. ఆమె అలా చెబుతూ ఉంటే అమ్మ న‌మ్ర‌త మురిపోకుండా ఎలా ఉండ‌గ‌ల‌దు..! ఆ విష‌యాన్ని న‌లుగురితో పంచుకోకుండా ఎలా ఆగ‌గ‌ల‌దు! అదే ప‌ని చేసింది న‌మ్ర‌త‌.

‘ఏడు త‌రాలా..?  వెతికితే దొర‌క‌నంత‌మందా..? క‌లిస్తే వ‌దులుకోలేనంతమందా..?’... ఆ సినిమాలో సమంత చెప్పిన ఈ డైలాగులును సితార చెబుతూ ఉంటే - అమ్మ న‌మ్ర‌త వీడియో తీసింది. దాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స‌మంత‌కు షేర్ చేసింది. ఈ వీడియో చూసిన మ‌హేష్ అభిమానులు కూడా లైకులు కొట్ట‌కుండా ఎలా ఉంటారు చెప్పండీ! ఇక‌, కామెంట్లూ షేర్లు... చెప్పాల్సిన ప‌నే లేదు. సితార చెప్పిన డైలాగుల‌తోపాటు...  ఆ డైలాగులు చెబుతున్న‌ప్పుడు పెడుతున్న ఫేస్ ఫీలింగ్స్ మ‌రీ ముద్దొచ్చేలా ఉన్నాయి. మ‌హేష్ అభిమానుల‌తో స‌మంత ఫ్యాన్స్ కూడా ఇదో స‌ర్ ప్రైజ్ బ‌హుమాన‌మే అని చెప్పాలి. సితార చెప్పిన డైలాగుల వీడియోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది న‌మ్ర‌త‌. ఇప్పుడా వీడియో వైర‌ల్ అవుతోంది. ఆ క్యూట్ క్యూట్ డైలాగుల్ని మీరు కూడా చూసెయ్యండి మ‌రి!
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News