ఫోటో స్టోరి: చిరుతపులి సో క్యూట్

Update: 2019-12-08 07:37 GMT
సోష‌ల్ మీడియా విస్తృతం కావ‌డం.. దాని ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా వుండ‌టంతో సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఈ ఆయుధాన్ని ప్ర‌భావ‌వంతంగా ప్ర‌చారం కోసం ఉప‌యోగిస్తున్నారు. సినీ సెల‌బ్రిటీలు ఈ విష‌యంలో చాలా ముందున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ సినిమాల అప్ డేట్ ల‌తో పాటు ఫ్యామిలీ విష‌యాలు.. ఫొటో షూట్ లు.. విహార యాత్ర‌ల‌కు సంబంధించిన విష‌యాల్ని నేరుగా ప‌బ్లిక్ తో.. అభిమానుల‌తో పంచుకోవ‌డం కోసం సోష‌ల్ మీడియాలో ఆశ్ర‌యిస్తున్నారు. అత్య‌ధికంగా త‌మ దైనందిన జీవితంలోని కీల‌క విష‌యాల‌తో పాటు ప్ర‌తీ అంశాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

గ‌త కొంత కాలంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త సోష‌ల్ మీడియాలో అంద‌రిలాగే యాక్టీవ్ గా వుంటున్నారు. త‌మ ఫ్యామిలీ ప‌ర్స‌న‌ల్ టూర్ల‌కు సంబంధించిన ఫొటోలు.. వీడియోల‌తో పాటు త‌న ముద్దుల కూతురు సితార‌కు సంబంధించిన డ్యాన్సింగ్ వీడియోల‌ని ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. అవ‌న్నీ అభిమానుల్లో అంతే జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా న‌మ్ర‌త షేర్ చేసిన సితార ఫొటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. చిరుత స్కిన్ ని త‌ల‌పించే స్కార్ఫ్ ని క‌ప్పుకున్న సితార చురుకైన‌ క‌ళ్ల‌ని ఎలివేట్ చేస్తున్న ఓ ఫొటోని షేర్ చేసిన న‌మ్ర‌త ఆ ఫొటోకు `మై లియోపార్డ్ బేబీ` అంటూ ఫ‌న్నీ క్యాప్షన్ ని జ‌త‌చేశారు. సీతా పాప అమాయ‌క‌మైన చూపులు.. ఆ మోములో ఫ‌న్ ఆక‌ట్టుకుంటోంది. ఇక మామ్ న‌మ్ర‌త మాట‌ల్లో పుత్రికోత్సాహం క‌నిపిస్తోంద‌ని నెటిజ‌నం ఈ ఫోటోపై వ్యాఖ్య‌లు చేస్తున్నారు.
Tags:    

Similar News