మహేష్ పాప.. ఎంత ముద్దొస్తోందో

Update: 2016-03-08 10:06 GMT
సూపర్ స్టార్ కృష్ణ అందగాడు.. మహేష్ బాబు ఆయన్ని మించిన హ్యాండ్సమ్. ఇక అతడి పిల్లలు ఎలా ఉంటారు మరి. గౌతమ్ - సితార ఇద్దరూ కూడా మొద్దొచ్చే పిల్లలే. ముఖ్యంగా సితార అయితే మరీ క్యూట్. గౌతమ్ ఇప్పటికే ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెరంగేట్రం చేసి సూపర్ స్టార్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తే.. సితార కూడా త్వరలోనే తెర మీద కనువిందు చేయబోతోంది.

‘బ్రహ్మోత్సవం’ సినిమాలో తన కూతురితో కలిసి తెరను పంచుకోబోతున్నాడు. మహేష్. తెరమీద సితార ఎలా కనిపించబోతోందో చూద్దామన్న ఆత్రులతో ఉన్న అభిమానులకు హింట్ ఇస్తున్నట్లుగా మహేష ఫ్యామిలీ ఓ ఫొటోను మీడియాకు రిలీజ్ చేసింది.

నిన్న మహా శివరాత్రి సందర్భంగా సితార దేవుడికి దండం పెడుతున్న ఫొటో ఒకటి  ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రెండు జడలు వేసుకుని చాలా క్యూట్ గా కనిపిస్తున్న సితార.. అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముందు ఈ ఫొటో బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిందేమో అనుకున్నారు నెటిజన్లు. తర్వాతే తెలిసింది ఇది మహా శివరాత్రి నేపథ్యంలో తీసిన ఫొటో అని. మరి బ్రహ్మోత్సవం సినిమాలో సితార ఎలా కనిపిస్తుందో చూడాలి.
Tags:    

Similar News