గొప్ప నటుడుని కోల్పోయాం అంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్

Update: 2020-04-29 09:10 GMT
బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు సడన్ గా ఇర్ఫాన్ చనిపోయాడనే వార్త అందర్నీ కలిసివేస్తుంది. భారతీయ సినిమాకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన ఇర్ఫాన్.. 54 ఏళ్ల వయసులోనే కన్నుమూయడంతో సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంతేకాకుండా మూడు రోజుల కిందే ఆయన తల్లి చనిపోవడం.. ఇప్పుడు అతను కూడా మరణించడంతో కుటుంబ సభ్యులు అంతులేని వేదన అనుభవిస్తున్నారు.

కాగా ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ అకాల మరణంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'బ్రిలియంట్ యాక్టర్‌ ని ఇంత త్వరగా కోల్పోతాం అని ఊహించ లేదని.. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధపడ్డా.. నిజంగా మనం అతన్ని మిస్ అయ్యాం.. ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నా' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్ మొత్తంలో నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన 'సైనికుడు'. ఈ సినిమాలో విలన్ 'పప్పు యాదవ్‌' గా ఇర్ఫాన్ నటనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. అందుకే ఆయన బాలీవుడ్‌ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా తెలుగు ప్రేక్షకులు సైనికుడు 'పప్పు యాదవ్' గానే గుర్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఎందుకో కానీ తెలుగు సినిమాల వైపు రాలేదు ఇర్ఫాన్ ఖాన్. బాలీవుడ్ చిత్రాలతో పాటు ‘స్లమ్‌డామ్ మిలియనీర్’ ‘ఇన్ఫెర్నో’ ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాడు. ఆయన నటించిన 'పాన్ సింగ్ తోమర్' చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ చివరి సారిగా 'అంగ్రేజీ మీడియం' చిత్రంలో నటించారు. ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కి కొన్ని రోజుల ముందు విడుదలైంది. 
Tags:    

Similar News