చెన్నైలో తన బాల్యం, విద్యాభ్యాసం అంతా చాలా మామూలుగా సాగిందని మహేష్ బాబు చెప్పాడు. ఓ స్టార్ కొడుకులా తానెప్పుడూ భావించలేదని.. తన తండ్రి కూడా అలా పెంచలేదని.. చెన్నైలో తన చిన్నతనమంతా చాలా సాదాసీదాగా సాగిందని అన్నాడు. తాను అందరిలాగే మామూలుగా కాలేజీకి వెళ్లానని.. బంక్ కొట్టి సినిమాలు కూడా చూశానని ‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ఆడియో విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ వెల్లడించాడు. చెన్నైలో సత్యం సినిమాస్ చాలా ఫేమస్ అని.. తాను కూడా అందులో చాలా సినిమాలు చూశానని.. ఇప్పుడు అదే చోట తన సినిమా తమిళంలో డైరెక్టుగా విడుదలవుతుండటం చాలా గర్వంగా అనిపిస్తోందని మహేష్ చెప్పాడు.
శ్రీమంతుడు మొదలుపెట్టినపుడు తమిళంలోకి డబ్బింగ్ చేయాలని.. తెలుగుతో పాటే విడుదల చేయాలని అనుకోలేదని.. ఐతే మధ్యలో సినిమాటోగ్రాఫర్ మధి ఈ కంటెంట్ తమిళ ఆడియన్స్ కు కూడా నచ్చుతుందని.. డబ్ చేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టామని మహేష్ చెప్పాడు. శ్రీమంతుడు ‘టిపికల్ మహేష్ బాబు సినిమా’లా ఉంటుందా అని అడగ్గా.. అలాగేమీ కాదని.. ఇదో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. ఎవరికేం కావాలో అన్నీ ఉంటాయని చెప్పాడు. ఒక్క లైన్లో శ్రీమంతుడు గురించి తమిళ ఆడియన్స్ కు చెప్పమని అడగ్గా.. ‘‘నమ్మ కిట్ట ఇరకరుదు నమ్ము సొసైటీకి తిరిపి కుడుకనం’’ (మనదగ్గర ఉన్నది సొసైటీకి తిరిగివ్వాలి) అంటూ అచ్చ తమిళంలో సెలవిచ్చాడు మహేష్. తనకు తమిళం వచ్చినా.. చాలా బిజీగా ఉండటం వల్ల తమిళ వెర్షన్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పలేకపోయానని.. బ్రహ్మోత్సవం సినిమాకు మాత్రం తనే డబ్బింగ్ చెబుతానని మహేష్ స్పష్టం చేశాడు.