సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నిన్నంతా కూడా ఫ్యాన్స్ పోకిరి ఒక్కడు సినిమాలతో పండుగ చేసుకున్నారు. నెల రోజుల ముందు నుండే పోకిరి స్పెషల్ షో లకు సంబంధించిన హడావుడి కనిపించింది.
వంద షో లను తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో పడేలా మొదట ప్లాన్ చేశారు. ఆ సంఖ్య కాస్త 150... 175 వరకు పెరిగింది. పోకిరి ప్రత్యేక ప్రీమియర్ కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఏకంగా 325 స్క్రీన్ లో స్క్రీనింగ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ముఖ్య పట్టణాలు మరియు అమెరికాలో కూడా పోకిరి సినిమా యొక్క ప్రీమియర్ చేయడం జరిగింది. దాదాపు అన్ని చోట్ల కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా కోటి వరకు పోకిరి ఒక్క షో ద్వారా గ్రాస్ వసూళ్లను దక్కించుకుందట.
పోకిరి సినిమా వచ్చి 16 ఏళ్లు అయ్యింది.. ఇప్పటి వరకు వందల సార్లు టీవీల్లో వచ్చింది... ఓటీటీ లో కూడా ఉంది. అయినా కూడా ఇంతగా థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు జనాలు బారులు తీరడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. పోకిరి రీ రిలీజ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అభిమానులు మహేష్ బాబు నుండి మరిన్ని పోకిరి తరహా సినిమాలు కోరుకుంటున్నారని అనిపిస్తుంది.
బర్త్ డే సందర్బంగా పోకిరి మాత్రమే కాకుండా ఒక్కడు కూడా స్క్రీనింగ్ అయ్యింది. పోకిరి సినిమా స్థాయిలో కాకున్నా ఒక్కడు కూడా భారీ ఎత్తున షో లు పడ్డాయి.. ఎక్కువ మంది చూసేందుకు ఆసక్తి చూపించారు. మహేష్ బాబు నుండి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు.. ప్రత్యేక సినిమాలు కాకుండా ఫక్త్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఆశిస్తున్నారని దీన్ని బట్టి అర్థం అవుతుంది.
అందుకే మహేష్ బాబు ఇక నుండి కథల ఎంపిక విషయంలో పోకిరి మరియు ఒక్కడు సినిమాల తరహా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను కథలను ఎంపిక చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు అని తాజా ప్రీమియర్ షోల ద్వారా నిరూపితం అయ్యింది. ప్రస్తుతం మహేష్ బాబు చేయబోతున్న త్రివిక్రమ్ సినిమా అలాంటి కమర్షియల్ మూవీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.