ఈ ఏడాది సమ్మర్ కి షెడ్యూల్ చేసిన టాలీవుడ్ మూవీస్ లో.. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను.. అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య ఉన్నాయి. రిలీజ్ డేట్ తో సహా ఈ రెండు సినిమాల మధ్య చాలానే పోటీనే నెలకొంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఫస్ట్ ఇంపాక్ట్ ఇచ్చేశాడు.
నా పేరు సూర్య టీజర్ కే కొత్త పేరు పెట్టి మరీ జనవరి 1న విడుదల చేశాడు బన్నీ. మిలిటరీ మ్యాన్ గా అల్లు అర్జున్ నటిస్తుండగా.. కోపిష్టి వ్యక్తిగా యాక్ట్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. దేశభక్తి యాంగిల్ చుట్టూనే సినిమా సాగుతుందనే సంగతి తెలిసిపోతూనే ఉంది. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని గతంలో చెప్పారు. అదే డేట్ కు రావాల్సిన మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను విషయంలో మాత్రం ఏ సంగతులు తెలియడం లేదు. కొరటాల శివ దర్శకత్వం కావడంతో.. ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నా.. ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా ఇవ్వలేదు.
మరోవైపు బన్నీ సినిమాకు మాత్రం బజ్ పెరిగిపోతోంది. అందుకే మహేష్ బాబు కూడా త్వరగా టీజర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో మేకర్స్ నుంచి అనౌన్స్ మెంట్ రాకపోతే.. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మరీ డిమాండ్ చేయాలని డిసైడ్ అయ్యారట. మరోవైపు.. ఒకే డేట్ ను టార్గెట్ చేసిన రెండు సినిమాల్లో ఒకటి ఇలా వెనుకబడ్డం ఏంటో అనే కామెంట్స్ సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.