అసలు సోషల్ నెట్వర్క్ తో తెలుగు సినిమాలపై ఇలాంటి ఒక రియక్షన్ చోటు చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సరిగ్గా ఇప్పుడు ''బ్రహ్మోత్సవం'' సినిమా మాత్రం మైండ్ బ్లాంక్ చేసేసింది. సర్లేండి.. చాలా స్టార్ల సినిమాలు వస్తుంటాయి.. హిట్వుతుంటాయి.. ఫట్టంటుంటాయి.. కాని ఆన్ లైన్ లో సినిమా ఫ్లాపైందనే క్రిటిసిజం మాత్రం ఒక మోతాదులోనే ఉంటుంది. మరీ అంత మితిమీరిపోదు. కాకపోతే ఎందుకో బ్రహ్మోత్సవం విషయంలో ఇది కాస్త బీభత్సమైన రేంజులో ఉంది. ట్రాలింగ్ పేరుతో బోలెడన్ని జోకులు వేస్తే రచ్చ రచ్చ చేస్తున్నారు మనోళ్ళు.
ఇకపోతే ఇలాంటి ట్రాల్స్ అన్నీ కలుపుకుని.. ''ఫ్లాపు-ఉత్సవం'' #FlopUtsavam ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది అంటూ 'న్యూ ఇండియన్ ఎక్సప్రెస్' పత్రిక వారు ఒక ప్రత్యేక కథనం ప్రచురించారు. ఇతర స్టార్ల ఫ్యాన్లు బ్రహ్మోత్సవం పై ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు తమ ఫేస్ బుక్ పేజీల్లో ఈ ట్రాల్స్ ను ఎక్కువ పోస్టింగ్ చేస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ఇక మహేష్ బాబు డ్యాన్సు స్టెప్పుపై వచ్చిన నెగెటివిటీ.. సినిమా బాగుందంటూ ప్రెస్ మీట్ లో చెప్పిన కృష్ణ - నరేష్ లపై సెటైర్లు.. అలాగే రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు.. అన్నింటి గురించా ఆ కథనం చెప్పింది.
కాని ఈ కథనంతో మహేష్ అభిమానులకు మాత్రం కోపం వచ్చింది. కొందరు పేరున్న డిస్ర్టిబ్యూటర్లు కూడా.. ఇది జర్నలిజంలోనే చాలా విలువలు కోల్పోయిన రోజు అంటూ ట్వీట్లు వేశారు. అంతే కాదు.. కొందరు అభిమానులు ఏకంగా ఈ పత్రికను ''రెస్ట్ ఇన్ పీస్ (రిప్)'' #RIPIndianExpress అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు కూడా. ట్రాల్స్ అనేవి కేవలం ఫేస్ బుక్ వరకే పరిమితమైతే.. ఇప్పుడు ఈ కథనం వలన సామాన్య ప్రేక్షకులకు కూడా అవి చేరవేయబడుతున్నాయని వీరు ఆవేదన చెందుతున్నారట.