మెగాస్టార్‌ కు మహేష్ ఫ్యాన్స్ విషెస్

Update: 2015-08-17 16:50 GMT
ఇప్పుడు బెజవాడలో వెలిసిన పోస్టర్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అవేమీ సంచలన వార్తలు కాదు, ఎవరినో క్రిటిసైజ్ చేస్తున్నవీ కాదు. మెగాస్టార్ బర్త్ డే విషెస్ చెబుతున్న ఫ్లెక్సీలు అంతే. అయితే వీటిని ఏర్పాటు చేసింది మహేష్ ఫ్యాన్స్ కావడమే ఇక్కడ అసలు హైలైట్.

మెగాస్టార్ చిరంజీవి గారికి మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫు నుంచి 60వ జన్మదిన శుభాకాంక్షలు అంటూ భారీ పోస్టర్స్, ఫ్లెక్సీలు కట్టారు. ఈ పోస్టర్లలో చిరు, మహేష్‌ ల ఫోటోలు తప్ప మరెవరి మొహాలు లేవు. కేవలం మహేష్ బాబు విజయవాడ ఫ్యాన్స్ అని మెన్షన్ చేశారంతే. వాస్తవంగా చెప్పాలంటే ఒక హీరోకి మరో హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ బర్త్ డే విషెస్ చెప్పడం శుభ పరిణామమే.

అయితే ప్రతీ అంశంలోనూ నెగిటివ్ అంశాలని వెతుక్కునే కొంతమంది ఉంటారు. ఈ పోస్టర్‌లో.. 60 అనే అంకెను చాలా పెద్దదిగా వేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే మీ మెగాస్టార్ కి ఏజ్ 60 దాటిపోతోంది అని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని అంటున్నారు. అయినా సరే.. ఏజ్ లో ఏముంటుంది చెప్పండి. మెగాస్టార్ షష్టి పూర్తి చేసుకోబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా కొత్త కాన్సెప్ట్‌ కు తెర తీసిన మహేష్ ఫ్యాన్స్‌ ను అభినందిద్దాం.

Tags:    

Similar News