ఫస్ట్ లుక్ అప్డేట్: మహేష్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిన 'సర్కారు వారి పాట' టీమ్..!

Update: 2021-07-29 13:19 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రీ లుక్ - మోషన్ పోస్టర్స్ లో మహేష్ లుక్ ని రివీల్ చేయకపోవడంతో.. అందరూ పూర్తి లుక్ రిలీజ్ చేసే సందర్భం కోసం వేచి చూస్తున్నారు. అలాంటి సందర్భం రానే వచ్చింది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు కావడంతో 10 రోజుల ముందుగానే సెలబ్రేట్ చేసుకునే అప్డేట్ తో వచ్చారు సర్కారు వారు.

జూలై 31న 'సర్కారు వారి పాట' ఫస్ట్ నోటీస్ పేరుతో ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సూపర్‌ స్టార్‌ ను ఇంతకముందు ఎప్పుడూ చూడని సరికొత్త అవతారంలో చూడటానికి సిద్ధంగా ఉండమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కు సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో బ్యాగ్ పట్టుకొని వెళ్తున్న మహేష్ ఓ బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఇది దుబాయ్ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ లోని స్టిల్ అని తెలుస్తోంది. ఈ పోస్టర్ ఇలా ఉంటే.. మరో రెండు రోజుల్లో రాబోయే సర్ప్రైజ్ ఎలా ఉంటుందో అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ - సుబ్బరాజు - రావు రమేష్ - వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్.మధి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు - నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట - గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'సర్కారు వారి పాట' చిత్రం 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News